వింత వింత పోకడలకు సమాజం నెలవు. బిజినెస్‌ను పెంపొందించుకునేందుకు మార్కెట్‌ను(Market) మాయాజాలం చేస్తుంటారు. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొత్త ఆలోచనలకు తెరలేపుతారు. తాజాగా ఇలాంటిదే ఐడియానే ఓ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌కు తట్టింది. సింగిల్‌గా ఉంటున్న(single youth) యువతను ఈ ఈవెంట్‌ టార్గెట్‌ చేసింది. ఇందుకోసం ఓ ఈవెంట్‌ను(event) అరేంజ్‌ చేసింది.

వింత వింత పోకడలకు సమాజం నెలవు. బిజినెస్‌ను పెంపొందించుకునేందుకు మార్కెట్‌ను(Market) మాయాజాలం చేస్తుంటారు. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొత్త ఆలోచనలకు తెరలేపుతారు. తాజాగా ఇలాంటిదే ఐడియానే ఓ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌కు తట్టింది. సింగిల్‌గా ఉంటున్న(single youth) యువతను ఈ ఈవెంట్‌ టార్గెట్‌ చేసింది. ఇందుకోసం ఓ ఈవెంట్‌ను(event) అరేంజ్‌ చేసింది. అందుకుగాను 'వేర్‌ సింగిల్ గైస్ కెన్ అటెండ్‌ ద ఈవెంట్‌ టు గెట్‌ మింగిల్డ్ ఇన ద ఈవెంట్' అనే చక్కటి క్యాప్షన్‌ను జోడించింది.

వివరాలు చూస్తే గచ్చిబౌలిలోని(Gachibowli) ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఈనెల 25న ఓ ఈవెంట్‌ను ఆర్గనైజ్‌ చేస్తోంది. గచ్చిబౌలిలోని తిరుమల ప్లాటినం భవనంలోని(Platinum biulding) ఐదో అంతస్తులో ఈ ఈవెంట్‌కు ఏర్పాట్లు చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 గంటల వరకు ఇక్కడికి రావొచ్చని తెలిపింది.
22-30 ఏళ్ల వయసున్న సింగిల్స్‌ వచ్చి మింగిల్‌ కావొచ్చని తెలిపింది. అయితే ఎంట్రీ ఫీజు, షరతలు ఏంటనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
కానీ అద్భుతమైన క్యాప్షన్‌ను మాత్రం జోడించింది. Where Single Guys can attend the event to get mingled in the event అనే టైటిల్‌ను ఈ ఈవెంట్ మేనేజ్మెంట్‌ నిర్వాహకులు పెట్టారు. దీంతో హైదరాబాద్‌లోని యువత దృష్టి ఒక్కసారిగా దీనిపై పడింది. డబ్బు గుంజేందుకే ఇలాంటివి అని కొందరు అంటున్నారు. చూసొస్తే పోలా.. అని కొందరు అంటుండగా.. ఎంట్రీ ఫీ ఎంత అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Updated On 21 Jan 2024 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story