వేసవి కాలం మొదలు కాబోతుంది అంటేనే భయం వేస్తుంది. ఈ సారి ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండిపోతున్నాయి అనేది నిపుణులు చెపుతున్నారు. విపరీతమైన ఎండలు ,ఉక్కబోత ,ఎప్పుడు ఏసీ ,కూలర్ వాడాలంటే కరెంటు బిల్లు తో తంట . కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు వేసవి గుబులు నుండి ఉపశమనం దొరుకుతుంది . . అవేంటి అంటే * ఇంటిలో వేడిని తగ్గించటం కోసం పలుచని కాటన్ కర్టైన్స్ ని వాడడం మంచిది . ముదురురంగు […]

వేసవి కాలం మొదలు కాబోతుంది అంటేనే భయం వేస్తుంది. ఈ సారి ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండిపోతున్నాయి అనేది నిపుణులు చెపుతున్నారు. విపరీతమైన ఎండలు ,ఉక్కబోత ,ఎప్పుడు ఏసీ ,కూలర్ వాడాలంటే కరెంటు బిల్లు తో తంట . కొన్ని చిట్కాలు పాటిస్తే కొంతవరకు వేసవి గుబులు నుండి ఉపశమనం దొరుకుతుంది . . అవేంటి అంటే

* ఇంటిలో వేడిని తగ్గించటం కోసం పలుచని కాటన్ కర్టైన్స్ ని వాడడం మంచిది . ముదురురంగు మరియు సింథటిక్ బట్టను అవాయిడ్ చేయండి .

*వంటగదిలో ఎక్సస్టర్ ఫ్యాన్ ని వాడటం వలన వంట గదిలో నుండి వచ్చే అధికవేడినుండి బయటపడగలము . వీలైనంత వరకు ఉదయం 10 గంటల లో పు వంటపనులు చక్కపెట్టుకోవటం మంచిది .

*ఇంట్లో పెంచుకొనే మొక్కలని తేమ అనేదెలా ఉంచటం వలన అవి ఇంటి వాతావరణాన్ని చల్ల బరుస్తాయి .ఫ్రెష్ ఎయిర్ ని అందిస్తాయి .

*గాలి ,వెలుతురు వచ్చేలా తలుపులు కిటికీలని తీసుకొని ఉంచాలి. దీని వాళ్ళ ఇంట్లో ఉన్న వేడి ,గాలి బయటకు వెళ్తాయి .

*భారీ వస్తువులతో ,సామాన్లతో ,బట్టలతో ఇంటిని చిందర వందరగా కాకుండా వీలైనంత ఖాళీగ ఉంచుకోవటం వలన గాలి వేస్తుంటుంది .

*టేబుల్ ఫ్యాన్ కి చల్లని బట్టను తడిపి కట్టడం ,ఐస్ క్యూబ్ లను ముందు ఫ్యాన్ ని ఉంచటం వంటి వాటితో చల్లని గాలిని పొందవచ్చు .

పలుచని మజ్జిగ ,జవలు,తగినంత నీరు తీసుకోండి ఏవి శరీరాన్ని చల్ల బరుస్తాయి . కీరా,దోసకాయలు,

*కూల్ డ్రింక్స్ ,ఫ్రూట్ జ్యూస్,ఇతర శీతల పానీయాల్లో అదిక శతం చక్కెరలు ఉండటం వల్ల అవి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి .వీటికి దూరం గా ఉండటం మంచిది .

*ఇంటి పైకప్పుకి కూల్ పెయింట్ వేయటం,వాటర్ తో తడుపు కోవటం వంటివి చేస్తూ ఉంటారు . వాటితో పాటు మీకు గడ్డి ,కొబ్బరి ఆకులని వేసుకోవటం ప్రత్యామ్యాయంగా మంచి చల్లదనం గా ఉపయోగపడుతుంది .

*అలాగే వేసవిలో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవుతూ ఉంటాయి ఎప్పుడు చెక్ చేసుకోవటం మర్చిపోవద్దు .స్టెబిలైజర్స్ వాడటం మంచిది . అవసరం లేని వాటిని UN PLUG చేస్తూ ఉండటం మంచిది .

*బాల్కనీ ల్లో మొక్కలు అన్ని ఒకే చోట ఉంచటం తగినంత నీటిని అందించటం పలుచని బట్టతో కవర్ చెయ్యటం బాల్కనీ ఏరియాని చల్లగా ఉంచుకోవచ్చు .సాయంత్రం వేళలో ఇక్కడ సేదతీరేందుకు అనువుగా ఉంటుంది .

Updated On 27 Feb 2023 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story