బంగారమంటే(Gold) భారతీయ మహిళలకు మోజు ఎక్కవ. ఆ మాటకొస్తే మహిళందరూ బంగారాన్ని ఇష్టపడతారనుకోండి. కాకపోతే మనవాళ్లకు పిసరంత ఎక్కువగా ఉంటుంది. అందుకే చేతిలో డబ్బుంటే మొదట ప్రాధాన్యతను ఇచ్చేది బంగారానికే! ప్రస్తుతం మగవారితో ధీటుగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ రంగాల్లో(IT Industry) దూసుకుపోతున్నారు. వీరిలో చాలా మంది తమ సంపాదనను బంగారానికి వెచ్చించే బదులుగా మంచి లాభాలను అందించే ఇతర రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

బంగారమంటే(Gold) భారతీయ మహిళలకు మోజు ఎక్కవ. ఆ మాటకొస్తే మహిళందరూ బంగారాన్ని ఇష్టపడతారనుకోండి. కాకపోతే మనవాళ్లకు పిసరంత ఎక్కువగా ఉంటుంది. అందుకే చేతిలో డబ్బుంటే మొదట ప్రాధాన్యతను ఇచ్చేది బంగారానికే! ప్రస్తుతం మగవారితో ధీటుగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ రంగాల్లో(IT Industry) దూసుకుపోతున్నారు. వీరిలో చాలా మంది తమ సంపాదనను బంగారానికి వెచ్చించే బదులుగా మంచి లాభాలను అందించే ఇతర రంగాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 23 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల మహిళలలో 40 శాతం మంది మ్యూచువల్‌ ఫండ్స్‌(Mutual Funds) మీద ఇన్వెస్ట్ చేయడానికి, మరో 40 శాతం మంది స్టాక్‌ మార్కెట్‌లలో(Stock market) ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట! బ్యాంక్ బజార్‌ ఆస్పిరేషన్ ఇండెక్స్‌ అధ్యయనంలో వెల్లడైన నిజం ఇది! కొందరు మహిళలు బంగారం కొనడం వంటివి పక్కన పెట్టి రియల్‌ ఎస్టేట్‌లో(Real estate) పెట్టుబడి పెడుతున్నారు. ఆ విధంఆ తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించుకుంటున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు మరింత లాభాలను అందిస్తాయని తెలుసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో అయిదేళ్ల నుంచి పదేళ్ల వరకు పెట్టుబడి పెట్టినప్పుడు 12 నుంచి 15 శాతం పొటెన్షియల్ రిటర్న్స్‌ వస్తాయి. అయితే వీటిల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

Updated On 8 Jan 2024 9:14 AM GMT
Ehatv

Ehatv

Next Story