Ehlers-Danlos syndrome : ఆ వ్యాధి సోకితే అంతే సంగతులు... భూమ్మీద నూకలు చెల్లినట్టే!
ఎహ్లెర్స్ డాన్లోస్ సిండ్రోమ్(Ehlers-Danlos syndrome)...ఇదో మిస్టీరియస్ వ్యాధి. చాలా భయంకరమైనది కూడా! ఎలా వస్తుందో .. ఎందుకు వస్తుందో.. ఏ వయసు వారికి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేరు. ఈ వ్యాధి సోకితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎవంత మందికి ఈ వ్యాధి వచ్చిందన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆ మాటకొస్తే పేషెంట్‌కు కూడా తెలియదు తనకు ఆ వ్యాధి ఉందని, త్వరలోనే చచ్చిపోతానని...!
ఎహ్లెర్స్ డాన్లోస్ సిండ్రోమ్(Ehlers-Danlos syndrome)...ఇదో మిస్టీరియస్ వ్యాధి. చాలా భయంకరమైనది కూడా! ఎలా వస్తుందో .. ఎందుకు వస్తుందో.. ఏ వయసు వారికి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేరు. ఈ వ్యాధి సోకితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఎవంత మందికి ఈ వ్యాధి వచ్చిందన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆ మాటకొస్తే పేషెంట్‌కు కూడా తెలియదు తనకు ఆ వ్యాధి ఉందని, త్వరలోనే చచ్చిపోతానని...! పేషెంట్ తను అనుభవిస్తున్న బాధలను డాక్టర్లకు విడమర్చి చెప్పినా గుర్తించడం కష్టం. ఈ వ్యాధికి చికిత్స లేదు. దీన్నిజన్యుపరమైన రుగ్మతగా, అరుదైన వారసత్వ రుగ్మతగా పేర్కొంటారు. ఎలా అటాక్ అవుతుందో తెలియదు.. అకస్మాత్తుగా వ్యాధి వచ్చేస్ఉంది. చాన్నాళ్ల వరకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడవు. నిర్లక్ష్యం వహించకుండా వెంటనే డాక్టరు దగ్గరకు వెళ్లి అన్ని వైద్య పరీక్షలను జరుపుకుంటే, వైద్యులు ఆ వ్యాధిని గుర్తించగలిగితే ఆయుష్షును కొంచెం పొడిగించుకోవచ్చు. దీనికి చికిత్స మాత్రం లేదు.
న్యూజిలాండ్‌కు(New Zealand) చెందిన 33 ఏళ్ల మహిళకు ఇలాంటి భయంకరమైన వ్యాధి సోకింది. తనకు వచ్చిన జబ్బేమిటో ఆమె తెలుసుకోలేకపోయింది. మానసిక సమస్యలు ఉన్నట్టుగా ఆమెకు అనిపించి డాక్టర్లను సంప్రదించింది. ఒంట్లో నీరసంగా ఉంటున్నదని చెప్పింది. డాక్టర్లు కూడా దాన్ని సాధారణ జ్వరంగానే భావించారు. తనకున్న అనారోగ్య సమస్యలను ఆమె డాక్టర్లకు వివరించలేకపోయింది. డాక్టర్లు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి ఇదేదో మానసిక సమస్యకు సంబంధించినదని అనుకున్నారు. మానసిక రోగుల వార్డుకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స తీసుకుంటూ హఠాత్తుగా చనిపోయింది. అనుమానం వచ్చిన వైద్యులు ఏ కారణంతో ఆమె చనిపోయిందో తెలుసుకోవాలనుకున్నారు. పరీక్షలు చేశారు. అప్పుడు తెలిసింది ఆమెకు ఎహ్లెర్స్ డాన్లోస్ సిండ్రోమ్ సోకిందని. పాతికేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమెకు ఈ వ్యాధి వచ్చింది. కాకపోతే ఆమె ఈ జబ్బును గమనించలేకపోయింది. సాధారణ సమస్యలుగానే భావించింది. ఇదే ఆమె ప్రాణాలను తీసిందని డాక్టర్లు అంటున్నారు. ఈ వ్యాధి ఆమెకు వారసత్వంగా అబ్బినట్టు వైద్య పరీక్షలో తేలింది. ఇది చర్మంలోని టిష్యులకు, ఎముకలు, రక్తనాళాలు, ఇతర అవయవాలకు మద్దతు ఇచ్చే ప్రోటీన్ల డెఫిషియన్సీ అని చెప్పారు డాక్టర్లు.
దీనికారణంగా చర్మం(Skin) సాగదీయబడినట్లుగా ఉండి, కీళ్లు(Knee) వదులుగా ఉంటాయని, చిన్న రక్తనాళాలు పెళుసుగా మారి మచ్చలు ఏర్పడతాయని, శరీరం అంతా ఒకవిధమైన గాయాలు వచ్చి ఎన్నటికి నయం కాకుండా ఇబ్బంది పెడతుంటాయని అన్నారు. ఈ సిండ్రోమ్ కేసుల్లో కొన్ని తేలికపాటి సమస్యలే ఉటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(National Institute of Health) అంటోంది. కొన్నే ప్రాణాల మీదకు తెస్తాయని తెలిపింది. ప్రతి అయిదు వేలమందిలో ఒకరు ఈ వ్యాధి బారినపడతారు. దీనికి మందులు లేవు. తీవ్రమైన మైగ్రేన్ నొప్పి(Migran), పొత్తి కడుపు నొప్పి(stomach ache), కీళ్లు తప్పటం, సులభంగా గాయాలు కావడం , ఇనుము లోపం ఈ సిండ్రోమ్ లక్షణాలు.. ఈ వ్యాధి మూర్చ, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలనే చూపిస్తుంది కాబట్టి డాక్టర్లు ఆ తరహాలోనే చూసి ట్రీట్‌మెంట్ ఇస్తాడు. ఇలాంటి కేసుల్లో ఈ సిండ్రోమ్‌కి సంబంధించిన లక్షణాలను దృష్టిలో ఉంచుకుని మందులు ఇవ్వాలి. లేదంటే ఆ వ్యాధి అని గుర్తించక ఇచ్చిన మందులు రియాక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. రోగి ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది.