non-vegetarians : ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే
స్టాట్స్ ఆఫ్ ఇండియా(Stats of India) రూపొందించిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది మాంసాహారం తింటున్నారని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో 96 శాతం మంది మాంసాహారులు ఉన్నారని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో గతేడాది కంటే ఈ ఏడాది 5 శాతం మాంసాహారులు అధికమయ్యారట. తెలంగాణలో కార్యం ఏదైనా ముక్క, మందు ఉండాల్సిందే.
స్టాట్స్ ఆఫ్ ఇండియా(Stats of India) రూపొందించిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 70 మంది మాంసాహారం తింటున్నారని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో 96 శాతం మంది మాంసాహారులు ఉన్నారని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో గతేడాది కంటే ఈ ఏడాది 5 శాతం మాంసాహారులు అధికమయ్యారట. తెలంగాణలో కార్యం ఏదైనా ముక్క, మందు ఉండాల్సిందే. సందర్భం ఎలాంటిదైనా మెనూలో మటన్(Mutton) లేదా చికెన్(Chicken) ఉంచుతారు. అధిక శాతం మందికి ముక్క లేనిదే ముద్ద దిగడం లేదు. 18-49 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీ, పురుషులతో కలిసి సర్వే చేయగా… తెలుగు రాష్ట్రాల్లో 96 శాతం మంది మాంసాహారులే ఉన్నారని స్పష్టమైంది. తెలంగాణలో గతేడాది కంటే మాంసాహారుల సంఖ్య ఐదు శాతం పెరిగినట్లుగా వెల్లడైంది. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేను ప్రామాణికంగా తీసుకొని ఈ అధ్యయనం చేసినట్లుగా స్టాట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంసం తినేవారే ఎక్కువగా ఉండగా.. జాతీయ సగటు కంటే 20 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది.