కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కొత్త ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడనుందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం(Solar Eclipse) అయినప్పటికీ భూమిపై నుంచి చూస్తే పాక్షికంగానే కనిపిస్తుందని వివరించారు. అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే గ్రహణం కనిపిస్తుందని చెప్పారు. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదన్నారు. నార్త్ అమెరికా(North America), యూరప్(Europe), ఆఫ్రికా(Africa), నార్తర్న్ ఆసియా(Asia), సౌత్ అమెరికా(South America)లోని కొన్ని ప్రాంతాలు, గ్రీన్ లాండ్(Greenland), ఐలాండ్ వాసులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని తెలిపారు. వెస్ట్రన్ యూరప్‌లో మధ్యాహ్నం, నార్త్ వెస్ట్రన్ ఆఫ్రికాలో ఉదయం పూట, ఈస్ట్రన్ యూరప్‌లో సాయంత్రం వేళ ఈ గ్రహణం కనిపిస్తుందని తెలిపారు. మార్చి 29న భూమి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించే క్రమంలో సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా పేర్కొంది. భూమిపై నుంచి చూస్తే సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా మారుతాడని శాస్త్రవేత్తలు చెప్పారు.

ehatv

ehatv

Next Story