ఎంతటి పోటుగాడైనా, పోటుగత్తె అయినా ఆ కొండ(Mountain) ఎక్కాలంటే గజగజవణికిపోతారు. ఎలాంటి వర్వతాన్ని అయినా ఈజీగా ఎక్కేసి వారు ఆ పర్వతం ఎక్కాలంటే జడుసుకుంటారు. ఆ పర్వతం చైనాలో ఉంది. అక్కడున్న ప్రసిద్ధ తాయ్‌ పర్వతం(Thai Mountain) ఆ దేశ సాంస్కృతిక వైభవానికి చిహ్నం. చారిత్రిక ప్రాముఖ్యం ఉన్న శిఖరం. చైనాలోని(china) షాన్‌డాంగ్‌(Shandong) ప్రావిన్స్‌లో ఎత్తయిన ప్రదేశం.

ఎంతటి పోటుగాడైనా, పోటుగత్తె అయినా ఆ కొండ(Mountain) ఎక్కాలంటే గజగజవణికిపోతారు. ఎలాంటి వర్వతాన్ని అయినా ఈజీగా ఎక్కేసి వారు ఆ పర్వతం ఎక్కాలంటే జడుసుకుంటారు. ఆ పర్వతం చైనాలో ఉంది. అక్కడున్న ప్రసిద్ధ తాయ్‌ పర్వతం(Thai Mountain) ఆ దేశ సాంస్కృతిక వైభవానికి చిహ్నం. చారిత్రిక ప్రాముఖ్యం ఉన్న శిఖరం. చైనాలోని(china) షాన్‌డాంగ్‌(Shandong) ప్రావిన్స్‌లో ఎత్తయిన ప్రదేశం. దీన్ని వారు పవిత్ర తూర్పు పర్వతమని పిల్చుకుంటారు. సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ పర్వతం నుంచి వీక్షించవచ్చు. ఇంతటి విశేషం ఉంది కాబట్టే ఈ భారీ పర్వతాన్ని ఎక్కడానికి జనం ఉత్సాహం చూపిస్తారు. ఈ పర్వతం ఎక్కడానికి 6,600 మెట్లు ఉన్నాయి. మెట్ల మీద నుంచి ఎక్కాలన్నా ఎంతటివారికైనా కాళ్లు వణుకుతాయి. చేతిలో కర్ర ఉంటే తప్ప నడవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మెట్లు ఎక్కేటప్పుడు కింద భాగం సమ ఉష్ణోగ్రత ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తక్కువగా ఉండి చలిగా ఉంటుంది. అన్నేసి మెట్లు ఎక్కాల్సి రావడం వల్లనేమో సంపూర్ణ ఆరోగ్యంగా, దృఢత్వంగా ఉన్నవారు కూడా వణికిపోతుంటారు. ముసలివాళ్లలా కాళ్లు వణికిపోతాయి. కర్ర పట్టుకుని నడవాల్సి వస్తుంది. ఎప్పుడైనా చైనాకు వెళితే ఓసారి ట్రై చేసి రండి!

Updated On 19 April 2024 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story