మామూలుగా అయితే ఓ 40 ఏళ్లు వచ్చాక ప్రెగ్నెన్సీ(Pregnancy) కష్టమవుతుంది. ఆ మాటకొస్తే 35 ఏళ్లు దాటితేనే గర్భం దాల్చడం కష్టం. ఇప్పటి లైఫ్‌స్టయిల్‌ అందుకు సపోర్ట్‌ చేయదు.అలాంటిది ఓ 70 ఏళ్ల మహిళ కవల(Twins) పిల్లలకు జన్మనిచ్చిందంటే నమ్ముతారా? ఇది జరిగింది కాబట్టి నమ్మి తీరాలి.

మామూలుగా అయితే ఓ 40 ఏళ్లు వచ్చాక ప్రెగ్నెన్సీ(Pregnancy) కష్టమవుతుంది. ఆ మాటకొస్తే 35 ఏళ్లు దాటితేనే గర్భం దాల్చడం కష్టం. ఇప్పటి లైఫ్‌స్టయిల్‌ అందుకు సపోర్ట్‌ చేయదు.అలాంటిది ఓ 70 ఏళ్ల మహిళ కవల(Twins) పిల్లలకు జన్మనిచ్చిందంటే నమ్ముతారా? ఇది జరిగింది కాబట్టి నమ్మి తీరాలి. తూర్పు ఆఫ్రికా(East Africa) దేశమైన ఉగాండాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సఫీనా నముక్వాయా(Safina Namukwaya) అనే మహిళ 70 ఏళ్ల వయసులో ఎంచక్కా కవల పిల్లలను కనేసింది. ఇదేలా సాధ్యమంటారా...? డిటైల్స్‌లోకి వెళితే 1992లో నముక్వాయా భర్త చనిపోయాడు. నాలుగేళ్ల తర్వాత ఆమె మరో వ్యక్తిని మనువాడింది. తర్వాత 20 ఏళ్లకు ఆమె ఐవీఎఫ్‌ ద్వారా ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోయింది. ఈ విషాదం నుంచి తేరుకోవడానికి నముక్వాయాకు చాలా కాలం పట్టింది. తల్లి కావాలన్న కోరిక ఆమెకు బలంగా ఉండటంతో 70 ఏళ్ల వయసులో ఆ కోరికను తీర్చుకోగలిగింది. రెండోసారి కూడా ఐవీఎఫ్‌(IVF) ప్రక్రియ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. కవలపిల్లలలో ఒకరు పాప కాగా, మరొకరు బాబు. ప్రస్తుతం తల్లితో పాటు పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలోనే నముక్వాయా ఓ రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లయిన మహిళ నముక్వాయానే కావడం విశేషం.

Updated On 5 Dec 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story