వర్షాకాలం వచ్చిందటేనే.. రకరకాల రోగాలు రెడీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు తినే ఆహారం(Food) దగ్గర నుంచి వేసుకునే బట్టల(Clothes) వరకు పలు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ
ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నారులు జ్వరం(Fever), జలుబు(Cold), దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది.
వర్షాకాలం వచ్చిందటేనే.. రకరకాల రోగాలు రెడీగా ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు తినే ఆహారం(Food) దగ్గర నుంచి వేసుకునే బట్టల(Clothes) వరకు పలు జాగ్రత్తలు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ
ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నారులు జ్వరం(Fever), జలుబు(Cold), దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు(Fungal Infection), జీర్ణాశయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి ఫ్లూ జ్వరాలు, విరోచనాలు, వాంతులు కూడా వర్షాకాలం చిన్నారులలో ప్రధానంగా కనిపిస్తాయి.
వర్షకాలం ముఖ్యంగా పిల్లల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు.. ఆహారం, త్రాగునీరు విషయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని చిన్నారులకు త్రాగడానికి ఇవ్వాలి. అంతే కాదు ప్రోటీన్స్, విటమిన్స్ లోపం లేకుండా సమతుల ఆహారం అందించాలి.
వర్షపు నీటిలో పిల్లలు తడవకుండా జాగ్రత్త పడండి. అలా తడిస్తే.. జ్వరం, జలుబు లాంటివి బాధిస్తాయి. అంత కాదు పరిశుబ్రత గురించి వారికి చెప్పండి.. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడండి. త్వరగా ఆరని బట్టలను, తడిగా ఉండే షూస్ పిల్లలకు వేయకండి. ఎవాటి వల్ల రాషెస్ వస్తాయి.
అంతే కాదు పిల్లలు మురికి నీళ్లలో ఆడుకుంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి, వర్షంలో బయట ఆటలకు పిల్లలను దూరంగా ఉంచండి. అంతే కాదు మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. దోమలు, ఈగలు లాంటివి లేకుండా చూడాలి. వాటి వల్ల పిల్లకు డెగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటిసీజనల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది.
అనారోగ్యంతో ఉన్నవారికి పిల్లలకు దూరంగా ఉంచండి. చేతులునోట్లో పెట్టుకోకుండ జాగ్రత్త పడండి.. పిల్లలకు వేడి వేడిగా వండిపెట్టండి. నిలవ ఉన్న పదార్ధాలు, ఫ్రిజ్ వాటర్ లాంటివి ఇవ్వకండి.. ఇలా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటేనేు.. సీజనల్ వ్యాధులు దరిచేయరవు.