నెలనెల కరెంట్ బిల్(Current bill) చూసినప్పుడు గుండె గుబేల్ మంటుంది. ఇక అది వేసవి(summer) అయితే.. అది ఏ రేంజ్‌లో వస్తుందో పని కట్టుకుని చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇవన్నీ సాటి సామాన్యుడికి తెలియని కష్టాలు కావు. ఇక మండే వేసవిలోనూ మీ కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ చిట్కాలు పాటించండి. రిజల్ట్ నెక్ట్స్ మంత్ చూసుకోండి.

నెలనెల కరెంట్ బిల్(Current bill) చూసినప్పుడు గుండె గుబేల్ మంటుంది. ఇక అది వేసవి(summer) అయితే.. అది ఏ రేంజ్‌లో వస్తుందో పని కట్టుకుని చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇవన్నీ సాటి సామాన్యుడికి తెలియని కష్టాలు కావు. ఇక మండే వేసవిలోనూ మీ కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఈ చిట్కాలు పాటించండి. రిజల్ట్ నెక్ట్స్ మంత్ చూసుకోండి.

వేసవి వచ్చిందటే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్, ఫ్రిజ్‌లు అన్నీ పని చేస్తూనే ఉంటాయి. మరి బిల్ ఎలా తగ్గుతుంది? ఇదే కదా మీ డౌట్. ఏం లేదండి.. కాస్త జాగ్రత్త.. ఇంకాస్త శ్రద్ధ ఉంటే చాలు బిల్ తగ్గి తీరుతుంది.

ఎల్ఈడి లైట్స్‌(LED Lights) కొనండి
కరెంట్ తక్కువగా కాలాలంటే.. లెడ్ లైట్స్ వాడడం మంచిది. దీని వల్ల ఎక్కువగా కరెంట్ కాలదు. వెలుగు కూడా ఎక్కువగానే ఉంటుంది. వాటిని వాడితే.. కరెంట్ బిల్ ఎక్కువగా రాదు. కాబట్టి, మామూలు లైట్స్ కంటే ఈ లెడ్ లైట్స్‌కి మారిపోండి.

​ఏసీ(AC) వాడటం నేర్చుకోండి
వేసవిలో ఏసీ వాడటం ఓ కళ. నిజమే.. పడుకునే ఓ అరగంట ముందే ఏసీ ఆన్ చేసి.. కిటికీలు.. తలుపులు అన్నీ క్లోజ్ చేసి పెట్టండి. రూమ్ బాగా చల్లగా అయ్యాక.. ఏసీ ఆఫ్ చేసేసి.. ఫ్యాన్ వేసుకుని చూడండి. ఏసీ కంటే చల్లగా అనిపిస్తుంది. మంచి నిద్ర కూడా బాగా పడుతుంది.

నిర్లక్షాన్ని వదిలేయండి
మొదటి కారణం నిర్లక్షమే. మనం ఒక గదిలో ఉంటాం.. ఫ్యాన్ ఒక గదిలో తిరుగుతూ ఉంటుంది. అవసరం లేని చోట లైట్స్ వెలుగుతూ ఉంటాయి. కనిపించిన వెంటనే బిల్ గుర్తు చేసుకోండి. వెళ్లి కట్టకుండా ఉండలేరు.

వాటర్ ప్యూరిఫయర్స్(water purifiers)
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వాటర్ ప్యూరిఫయర్ ఉంటుంది. నిజానికి అన్ని కాలాల్లో కాకుండా వేసవిలో వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. వాటర్ ట్యాంక్ నిండిపోయాక దాన్ని ఆఫ్ చేసుకుని.. సగం పైనే ఖాళీ అయ్యాక ఆన్ చేసుకోవడం మంచిది. పైగా వేసవిలో ఫ్యూరిఫయర్‌లోకి వచ్చే నీళ్లు కూడా చాలా వేడిగా వస్తుంటాయి. దాని వల్ల ప్యూరిఫయర్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. రాత్రి పూట స్విచ్ ఆన్ చేసుకుని.. పగలు పూట ఆఫ్ చేసుకునే అలవాటు చేసుకోండి. అయితే మెషిన్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు సడన్‌గా ఆఫ్ చేయొద్దు.

ఫ్రిజ్(fridge) వాడకం..
నిజానికి ఫ్రిజ్‌ని కూడా రెండు మూడు గంటలు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని ఫ్రిజ్‌లకు డీప్ ఫ్రిజ్ ఆప్సన్స్‌లో ఆటోమెటిక్ ఆఫ్ ఉండదు. దాన్ని మనమే రెండు రోజులకి లేదా మూడు రోజులకి ఒకసారి ఆఫ్ చేసుకుంటూ ఉండాలి. అది గుర్తు పెట్టుకుని ఆఫ్ చేసుకోవడం నేర్చుకోండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా చేసుకోవచ్చు.

Updated On 16 April 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story