కుటుంబ వ్యవస్థకు మూల కారణం వివాహాలు. భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంజీవిన విధానం నుంచి మన వాళ్లు కూడా పాశ్చాత్య పోకడలు పోతున్నారు. అరేంజ్డ్‌ మ్యారేజెస్(Arrange Marriage) కాకుండా ప్రేమించి పెళ్లి(Love Marraige) చేసుకున్న జంటలు కూడా ఈరోజుల్లో విడాకుల(Divorce) కోసం కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. అయితే కొందరు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా వివాహేతర సంబంధాలకు(Extra Marrital Affairs) మొగ్గుచూపుతున్నారు

కుటుంబ వ్యవస్థకు మూల కారణం వివాహాలు. భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శం. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంజీవిన విధానం నుంచి మన వాళ్లు కూడా పాశ్చాత్య పోకడలు పోతున్నారు. అరేంజ్డ్‌ మ్యారేజెస్(Arrange Marriage) కాకుండా ప్రేమించి పెళ్లి(Love Marraige) చేసుకున్న జంటలు కూడా ఈరోజుల్లో విడాకుల(Divorce) కోసం కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. అయితే కొందరు పొరుగింటి పుల్లకూర రుచి అన్న చందంగా వివాహేతర సంబంధాలకు(Extra Marrital Affairs) మొగ్గుచూపుతున్నారు.ఈరోజుల్లో కొంత మంది వివాహేతర సంబంధాలకు ఎక్కువగా ఆకర్షిలవుతున్నారు. ఈ వివాహేతర సంబంధాలతో చక్కని సంసారంలో చిక్కులొస్తున్నాయి. కొందరైతే వివాహేతర సంబంధాల కోసం తమ భాగస్వాములను మట్టుబెడుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోడానికి కారణాలేంటో చూద్దాం..!

కొంతమంది తమ భాగస్వామిపట్ల అయిష్టంగా ఉంటారు. ఇంట్లో ఒత్తిడితో పెళ్ళి చేసుకుంటారు. లైఫ్ పార్ట్‌నర్‌ నచ్చక వీరి శృంగార జీవితం సరిగా నడవదు. అలాంటి వారు ఆ రిలేషన్ నుంచి బయటికి వచ్చేందుకు ఇష్టపడతారు. ఇతరులతో వివాహేతర సంబంధానికి మొగ్గుచూపుతారు. భాగస్వామిపట్ల విసుగుచెంది కూడా కొత్తవారికి అట్రాక్ట్ అవుతారు. చాలా మంది స్త్రీలు తమ భర్తను ఇతరులతో పోల్చుకుంటారు. తాము ఆశించినట్లు తమ భర్త లేడని, సంసార సుఖాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. పరాయి పురుషుల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇతర వ్యక్తులతో ఇల్లీగల్‌ రిలేషన్‌ పెట్టుకుంటారు. కొందరు జీవిత భాగస్వామితో గొడవ పడడం సహజం. కానీ కొందరు వాటిని లైట్‌ తీసుకుంటే.. మరికొందరు వాటిని భూతద్దంలో చూసుకుని ఇతరుల పట్ల మగ్గువ చూపి ఆ రిలేషన్‌ కొనసాగిస్తారు. కొందరికి అధిక కోరికలు ఉండడం, లైఫ్‌ పార్ట్‌నర్‌తో ఆ సుఖం దొరకడం లేదని, మరొక పార్ట్‌నర్‌తో గుట్టుచప్పుడు కాకుండా సెక్స్‌ సుఖం పొందుతుంటారు. అయితే ఈ కాలంలో ఇవి పెరిగిపోతుండడంతో తమ భార్య లేదా భర్తలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు.

Updated On 20 Nov 2023 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story