ఇప్పటి మహిళలకు వ్యాక్సింగ్‌(waxing) కామన్‌ అయిపోయింది. నెల నెల కాళ్లు చేతులు, అడర్‌ ఆర్మ్స్, ఫేస్, ఫుల్‌ బాడీ, బికినీ అంటూ ఒక్కోదానికి ఒక్కో ధర చెల్లించి మరీ వ్యాక్సింగ్‌ చేయించుకుంటున్నారు. అయితే వ్యాక్సింగ్‌ తర్వాత చర్మం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు వెంట్రుకలు పీకించుకున్న తర్వాత..

ఇప్పటి మహిళలకు వ్యాక్సింగ్‌(waxing) కామన్‌ అయిపోయింది. నెల నెల కాళ్లు చేతులు, అడర్‌ ఆర్మ్స్, ఫేస్, ఫుల్‌ బాడీ, బికినీ అంటూ ఒక్కోదానికి ఒక్కో ధర చెల్లించి మరీ వ్యాక్సింగ్‌ చేయించుకుంటున్నారు. అయితే వ్యాక్సింగ్‌ తర్వాత చర్మం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? అసలు వెంట్రుకలు పీకించుకున్న తర్వాత.. స్కిన్ ని ఎలా ట్రీట్‌ చేయాలి.. ఎలాంటి చిట్కాలు పాటించాలి? నిజానికి చాలా మందికి వ్యాక్సింగ్‌ తర్వాత దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. వాటిని కొన్ని ఇంటి చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

పంచదారతో(Sugar)
పంచదారతో స్క్రబ్‌ చేసుకోవాలి. అవును వ్యాక్సింగ్‌ చేయించుకోబోయే ప్రతిచోట.. ఈ స్క్రబ్‌ చేసుకోవాలి. ఇది ఇరిటేషన్‌ని దురదల్ని తగ్గించడంతో పాటు.. ఇన్‌ గ్రోన్‌ హెయిర్‌ రాకుండా యూజ్‌ అవుతుంది. ఒక కప్పు పంచదార, ఒక కప్పు కొబ్బరి నూనె ఒక బౌల్‌లో వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చేతులతో ఆయా ప్రాంతాల్లో అప్లై చేసుకోవాలి. వ్యాక్సింగ్‌ చేయించుకునే ముందు రోజు బాగా అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద(alovera)
కలబంద ప్రయోజనాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇది అప్లై చేసుకోవడంతో చాలా సమస్యలు దూరమవుతాయి. అందుకే వ్యాక్సింగ్‌ చేయించుకున్న తర్వాత కలబంద గుజ్జుని రాసుకుంటే.. చర్మం సున్నితంగా మృదువుగా మారుతుంది.

టీ ట్రీ నూనె(Tea tree oil)
ఈ పేరు విని కంగారు పడకండి. తేయాకు చెట్టు ఆయిల్‌ అనేది మార్కెట్‌లో ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీన్ని పది చుక్కలు కొబ్బరి నూనెలో కానీ బాదం నూనెలో కానీ.. లేదంటే సమపాళ్లల్లో ఉన్న కొబ్బరి–బాదం నూనెలో కానీ.. కలుపుకుని.. చర్మానికి రాసుకుంటే.. ఎలాంటి రియాక్షన్స్‌ లేకుండా మృదువుగా మారుతుంది. దీన్ని వ్యాక్సింగ్‌ తర్వాతే అప్లై చేసుకోవాలి.

కీరదోసతో..(Keera)
కీరదోస మాస్క్‌ చర్మాన్ని ఎలాంటి ఇబ్బందులకు గురిచేయదు. కీరదోసను గుజ్జులా చేసి.. చర్మానికి అప్లై చేసుకుంటే.. దోసలోని యాంటీ ఆక్సిడెంట్‌ ప్రాపర్టీస్‌ చర్మాన్ని సురక్షితంగా కాపాడతాయి. వ్యాక్సింగ్‌ సమస్యలకు చెక్‌ పెట్టేయడం సులభమవుతుంది.

లావెండర్‌ నూనె..(Lavender oil)
ప్రతి చర్మానికి సరిపడే ఆయిల్‌ ఇది. మాయిశ్చరైజర్‌కి చాలా చక్కగా ఉంటుంది, లావెండర్‌ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్‌ గుణాలు చర్మంపై ఉన్న గీతలు, మచ్చలు పోగొట్టడంతో పాటు.. వ్యాక్సింగ్‌ కారణంగా వచ్చిన దురదలు, దద్దుర్లు పోతాయి.

చమోమిలే నూనె(Chamomile Oil)
చర్మ సమస్యలకు చమోమిలే ఆయిల్‌ చాలా బాగా పని చేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తాయి. సమస్య ఉన్న ప్రాంతంలో ఈ ఆయిల్‌ రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. అలా చేస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి

Updated On 17 April 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story