Psycholoical Fats : సినిమాలు చూసి ఏడుస్తున్నారా? అయితే ప్రాణాలకు ముప్పే!
చాలా మంది సినిమాలు(Movies) చూస్తూ భావోద్వేగాలకు లోనవుతుంటారు.
చాలా మంది సినిమాలు(Movies) చూస్తూ భావోద్వేగాలకు లోనవుతుంటారు. శోకరస సన్నివేశాలు(Emotinal scenes) వచ్చినప్పుడు అవి చూస్తూ అసంకల్పితంగానే ఏడుస్తుంటారు. మనుషులు మారాలి సినిమాకు ఇంటర్వెల్‌లో కర్చిఫ్‌లు ఇచ్చారట! ఏడిస్తే తుడుచుకోవడానికి! ఇలా సినిమాలు చూసి ఏడ్చేవారికి అకాల మరణ ముప్పు ఎక్కువగా ఉందట! తిరస్కరణకు గురవుతామనే భయం ఉన్న వారు, సాధారణ పరిస్థితులను కూడా ముప్పుగా భావించేవారు కూడా అకాల మరణం చెందే అవకాశాలు ఉన్నాయని అమెరికాకు(america) చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
న్యూరోటిసిజంతో(Nuroticism) బాధపడుతున్న వారిలో ఇలాంటి ప్రవర్తనలు ఉంటాయంటున్నారు. వీరిలో అకాల మరణ ముప్పు 10 శాతం ఎక్కువ ఉంటుందని అధ్యయనంలో వెల్లడయ్యిందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సమస్య ఉన్నవారిలో ఆందోళన, ఒంటరితనం, విరక్తి వంటివి ప్రధానంగా కనిపిస్తాయి. ఇవి మనిషి మెదడు, శరీరంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఒంటరితనం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు పెరగడంతో పాటు తమకు తాము హాని తలపెట్టుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయట! న్యూరోటిసిజం సమస్యతో బాధపడుతున్న అయిదు లక్షల మందిపై, వారి 17 ఏళ్ల జీవితంపై ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.