అమ్మాయిలూ మీకు పెళ్లి(Marriage) ఫిక్సయిందా.. కాబోయే భర్తతో(Husband) ఎలాంటి విషయాలు షేర్‌ చేసుకోవాలో చూద్దామా..? పెళ్లి తర్వాత నిండ నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలి. సో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెళ్లి ఫిక్సయిన తర్వాత యువతీ, యువకులు తమకు కాబోయే భాగస్వామితో రోజులో గంటల తరబడి ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడం మనకు తెల్సిందే. కొత్త కొత్త ఆలోచనలు పంచుకుంటారు.

అమ్మాయిలూ మీకు పెళ్లి(Marriage) ఫిక్సయిందా.. కాబోయే భర్తతో(Husband) ఎలాంటి విషయాలు షేర్‌ చేసుకోవాలో చూద్దామా..? పెళ్లి తర్వాత నిండ నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలి. సో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెళ్లి ఫిక్సయిన తర్వాత యువతీ, యువకులు తమకు కాబోయే భాగస్వామితో రోజులో గంటల తరబడి ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడం మనకు తెల్సిందే. కొత్త కొత్త ఆలోచనలు పంచుకుంటారు. భవిష్యత్‌పై ప్రణాళికలు వేసుకుంటారు. ఇద్దరి వృత్తి లేదా వ్యాపారాలపై అభిప్రాయాలు షేర్‌ చేసుకుంటారు. పాజిటివ్‌ అంశాలు వ్యక్తం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బాండింగ్‌(Bonding) కూడా ఏర్పడుతుంది. అయితే ఇక్కడే సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. కాబోయే భర్తతో పొరపాటున కొన్ని విషయాలు చెప్పకూడదు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలి భర్త దగ్గరకు వెళ్తుంటారు. ఈ సందర్భంలో కొన్ని విషయాలను భర్తలకు అసలు చెప్పకూడదట.

తమ కుటుంబం లోటుపాట్లు(Family Flaw), తమ కుటుంబసభ్యుల లోపాలను భర్తతో అసలు చెప్పకూడదు. జనరల్‌గా ఎవరైనా నెగెటివ్స్‌ గురించి చెప్తే అవే ఎక్కువగా గుర్తించుకోవడం సహజం. సో మీ ఫ్యామిలీ నెగెటివ్స్‌ను తను గుర్తుంచుకుంటే మున్ముందు ప్రమాదంలో పడ్డట్లే అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరొక ముఖ్య విషయం మీకు గతంలో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్‌(Boyfriend) ఉంటే ఆ విషయాన్ని కాబోయే భర్తకు ఎలా చెప్పాలో అన్న సంశయం మీకు కలుగుతుంది. తన మాటతీరు, వ్యక్తిత్వాన్ని గమనించాలంటున్నారు. తను ఎలా రియాక్టవుతాడోనని అంచనా వేయాలంటున్నారు. లేదంటే మీ లైఫ్‌ రిస్క్‌లో పడ్డట్లే. అయితే తనకు గతంలో ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్‌(Girlfriend) ఉన్న విషయాన్ని చెప్పి ఎందుకు విడిపోయారో స్పష్టత ఇస్తే.. అలాంటి సందర్భాల్లో మీరు కూడా నిర్భయంగా చెప్పి... పాస్ట్ ఈజ్‌ పాస్ట్.. ఇప్పటి నుంచి 'నీకు నేను-నాకు నువ్వు' అన్న సంకేతాలు ఇవ్వాలంటున్నారు. ఈ విషయంలో ఇద్దరూ స్పష్టంగా ఒక నిర్దిష్ట అభిప్రాయానికి రావాలని సూచిస్తున్నారు.

పెళ్లి కొడుకు ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడకూడదంటున్నారు నిపుణులు. భర్త కుటుంబంలో తప్పులు ఎత్తిచూపే విషయంలో ఆచితూచి వ్యవహరించాలట. ఇవి చినికి చినికి పెద్దగా అయితే మాత్రం కచ్చితంగా ప్రాబ్లమ్స్‌ వస్తాయంటున్నారు. ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది. తన భర్త తన మాట వినాలని అమ్మాయిలు అనుకోవడం సహజం. కానీ భర్త తన మాటే వినాలనడం మూర్ఖత్వం అంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో మొండి పట్టుదల ఉండకూడదని సూచిస్తున్నారు. కొన్ని విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవద్దని, ఇది మీతిమీరితే చిక్కుల్లో పడతారంటున్నారు. ఎప్పుడూ ఓపెన్‌మైండ్‌తో ఉండాలంటున్నారు మానసిక వైద్య నిపుణులు.

Updated On 20 Nov 2023 5:31 AM GMT
Ehatv

Ehatv

Next Story