ప్రస్తుత కాలం లో ఆరోగ్య మీద శ్రద్ధ అనేది పెరగటం తో వివిధ రకాల వ్యాయామాలతో పాటు , జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేయటం, వివిధ రకాలైన జీవనశైలి ని అనుసరిస్తున్నారు . బరువు తగ్గించుకోవటం కోసం కొందరు ప్రయత్నిస్తుంటే,మంచి దేహ ధారుడ్యం కోసం కొంతమంది కష్టపడుతుంటారు. ఈ మధ్య కాలం లో వీటికోసం చాలామంది ప్రోటీన్ షేక్స్ ని తీసుకోవడం మనం చుసే ఉంటాం,బరువు నియంత్రణలో ప్రోటీన్ పాత్ర కీలకం .ప్రోటీన్ ఆధారిత పదార్దాలని […]

ప్రస్తుత కాలం లో ఆరోగ్య మీద శ్రద్ధ అనేది పెరగటం తో వివిధ రకాల వ్యాయామాలతో పాటు , జిమ్ కు వెళ్లి వర్కౌట్స్ చేయటం, వివిధ రకాలైన జీవనశైలి ని అనుసరిస్తున్నారు . బరువు తగ్గించుకోవటం కోసం కొందరు ప్రయత్నిస్తుంటే,మంచి దేహ ధారుడ్యం కోసం కొంతమంది కష్టపడుతుంటారు. ఈ మధ్య కాలం లో వీటికోసం చాలామంది ప్రోటీన్ షేక్స్ ని తీసుకోవడం మనం చుసే ఉంటాం,బరువు నియంత్రణలో ప్రోటీన్ పాత్ర కీలకం .ప్రోటీన్ ఆధారిత పదార్దాలని డైట్ లో తీసుకోవటం వలన కడుపు నిండుగా ఉంటుంది. ఆకలివేసే హార్మోన్స్ ని ఇవి కంట్రోల్ చేయటం వల్ల తక్కువగా తినే అవకాశం ఉంటుంది . దీనితో తొందరగా బరువుని తగ్గుతుంటారు . అలాగే వర్కౌట్స్ చేసేవాళ్ళు జిమ్ చేసిన కొద్దీ సమయానికే ఈ ప్రోటీన్ షేక్ తీసుకోవసి ఉంటుంది. దీని వలన మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది .ప్రోటీన్ కి సంబంధించి ఎన్నో రకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆడ మగ తేడా లేకుండా అందరు ఇప్పుడు ఈ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటూ ఉంటారు .

నిజానికి మార్కెట్లలో ఎన్నో రకాల ప్రోటీన్ పౌడర్లు,ప్రోటీన్ సప్లీమెంట్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ ఆరోగ్యానికి మంచివేనా.?

అంటే కాదు అనే అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ ప్రోటీన్ పౌడర్లలో గ్లోబులర్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది పాల ఉత్పత్తులకు ఉపయోగించే బయో ప్రోడక్ట్ . ఈ గ్లోబులర్ శరీరానికి ఎక్కువకాలం వెళ్తూ ఉండటం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువకాలం వీటిని వాడటం అనేది దుష్పరిణామాలకి దారితీస్తాయి . వీటి వల్ల మనం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ముఖ్యంగా ఏ ప్రోటీన్ పౌడర్లు లలో హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేసే బయో ఆక్టివ్ పెప్టిడ్స్ ఉండటం వలన ముఖం పైన మొటిమలు మచ్చలు వంటి చర్మ సంబంధమైన సమస్యలు వస్తుంటాయి. ప్రీ వర్కౌట్ ప్రోటీన్ పౌడర్లలో కెఫిన్ అధికంగా ఉంటుంది .దీని వలన గుండె దడ పెరుగుతుంది .. హై బీపీ సమస్యలు తప్పవు.

సహజ సిద్దమైన ఆహారాలు లో లభించే ప్రోటీన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ప్రోటీన్ పొడి వలన బాడీ లో ఎక్కువ శాతం ప్రోటీన్ చేరుకొని అది జీర్ణవ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది . దీనితో కడుపు ఉబ్బరం,మంట ,గ్యాస్ సమస్యలు వస్తాయి .నాణ్యత లేని ప్రోటీన్ పౌడర్లు తీసుకోవటం బాడీ లో టాక్సిన్స్ ఏర్పడి తలనొప్పి,అలసట ,మలబద్దకం ,మజిల్ పైన్స్ వస్తుంటాయి .

ఎక్కువకాలం శరీరానికి ఈ ప్రోటీన్ పొడి వాడటం వలన ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది .డయాబెటిస్ ,హార్ట్ ప్రోబ్లెమ్ కూడా వస్తున్నాయి అని హెచ్చరిస్తున్నారు వైద్యాధికారులు ..ఆర్టిఫిషల్ ప్రోటీన్ సప్లిమెంట్స్ కాని సహజ సిద్ధంగా లభించే ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు .పాలు,గుడ్లు,పన్నీర్,టోఫు,పప్పులు ,రాజ్మా ,శెనగలు వంటి వాటిల్లో ప్రోటీన్ పుష్కలం గా దొరుకుతుంది . ఇవే కాకుండా బాదాం,కాజు,ఆక్రూట్,చియాసీడ్స్,అవిసెగింజలు,పొద్దుతిరుగుడు ,పుచ్చ గింజలు ,గుమ్మడి గింజలు ,ఖర్జురామ్ అన్ని సమపాళ్లలో తీసుకొని ఇంట్లోనే ఎంతో రుచికరమైన ప్రోటీన్ పొడి ని తయారు చేసుకోవచ్చు .

గమనిక : పైన ఇవ్వబడిన సమాచారం వివిధ నిపుణల సలహాలు మరియు ఇంటర్నెట్ నుండి దొరికిన సమాచారం మేరకు పొందుపరచటం జరింగింది.వ్యక్తిగత ఆరోగ్య సలహాలు కోసం వైద్యులను సంప్రదించగలరు .దయచేసి గమనించగలరు

Updated On 25 Feb 2023 8:06 AM GMT
Ehatv

Ehatv

Next Story