ఈరోజుల్లో అందరూ ఏదో ఒక సమయంలో బ్లూ ఫిల్మ్స్‌(Pornography) చూస్తున్నవారే. ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. దీనికి తోడు మొబైల్‌లో ఏదో ఒక వీడియో(Video) చూద్దామనుకునేవాళ్లకి కొన్ని రికమండేషన్స్‌ వస్తుంటాయి.

ఈరోజుల్లో అందరూ ఏదో ఒక సమయంలో బ్లూ ఫిల్మ్స్‌(Pornography) చూస్తున్నవారే. ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. దీనికి తోడు మొబైల్‌లో ఏదో ఒక వీడియో(Video) చూద్దామనుకునేవాళ్లకి కొన్ని రికమండేషన్స్‌ వస్తుంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే అవి బ్లూఫిల్మ్స్‌ ఉన్న వీడియోలకు నేవిగేట్‌ చేస్తాయి. ఇంకేముంది మనం కూడా ఓ లుక్కేద్దామని అనుకుంటారు. ఇక తరుచుగా వాటిని చూడం స్టార్ట్ చేస్తారు. అయితే ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తే నష్టాలే అధికంగా ఉంటాయంటున్నారు.

నీలి చిత్రాలకు బానిసగా మారితే శృంగారంపై(Romance) ఆసక్తి తగ్గడంతోపాటు అంగ స్తంభన(Erection problems) సమస్యలు కూడా అధికమవుతాయంటున్నారు. ఈ అశ్వీల చిత్రాలను చూడడం కూడా ఒక రకంగా డ్రగ్స్‌ (Drugs)వాడకం వంటిదేనంటున్నారు. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటుపడితే మానుకోలేన్నట్టు.. అశ్లీల చిత్రాలకు అలవాటుపడితే మానుకోలేరని చెప్తున్నారు. అశ్లీల చిత్రాలను చూడటం సరదాగా మొదలైనా.. ఆ తర్వాత ఎక్కువ సమయం వాటిని చూడటానికే గడుపుతారంటున్నారు. దీంతో క్రమక్రమంగా సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోవడమే కాకుండా అంగ స్తంభన లోపాలు తలెత్తుతాయని చెబుతున్నారు.

మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు మెదడులో(Brain) ప్రేరేపితమయ్యే భాగాలే అశ్లీల చిత్రాలను చూసినప్పుడు కూడా ప్రేరేపితమవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో శృంగార స్పందనలు, శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా అలాంటి దృశ్యాలే మనసులో మెదులుతాయని అంటున్నారు. దీంతో సహజ శృంగారం కాస్తా కృత్రిమ(Mechanical) శృంగారంలా మారుతుందని.. దీని వల్ల అసంతృప్తికి, ఆందోళనలకు గురవుతారని వివరిస్తున్నారు. అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండటమే ఇందుకు పరిష్కారమని సూచిస్తున్నారు.

అంతే కాకుండా మంచిగా నిద్రపోయేవారికి వీర్యంలో(Sperm) నాణ్యత బాగుంటుందని కూడా ఈ సర్వే తెలిపింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 7–8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు వెల్లడైంది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత తగ్గిపోతుందట. అయితే ప్రతి రోజు 60 గ్రా.పప్పు ధాన్యాలు తింటే సెక్స్‌ పట్ల ఆసక్తితో పాటు, మెరుగైన భావప్రాప్తి కూడా పొందడమే కాకుండా అంగస్తంభన సమస్యను కూడా తగ్గిస్తుందుంటున్నారు నిపుణులు.

Updated On 18 March 2024 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story