Snake Repel Plants : ఇంటి ఆవరణలో ఈ చెట్లుంటే పాములు పరుగెడుతాయట..!
గ్రామీణ ప్రాంతాల్లో(Vilage) పాముల(Snake) బెడద అధికంగా ఉంటుంది. మన ఇంటి చుట్టుముట్టూ ఇవి తచ్చాడుతుంటాయి. పొలాలు(Agriculture), చెట్ల పొదలు, గుబురుగా ఉన్న చెట్ల దగ్గర ఎక్కువగ కనపడుతుంటాయి. ఎలుకలను(Rats) పట్టి ఇవి తినేస్తుంటాయి. పాములంటే మనలో చాలా భయాలు ఉంటాయి. పాము కాటుకుగురై చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కట్ల పాటు, తాచుపాములు కాటేస్తే సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో(Village) పాముల(Snake) బెడద అధికంగా ఉంటుంది. మన ఇంటి చుట్టుముట్టూ ఇవి తచ్చాడుతుంటాయి. పొలాలు(Agriculture), చెట్ల పొదలు, గుబురుగా ఉన్న చెట్ల దగ్గర ఎక్కువగ కనపడుతుంటాయి. ఎలుకలను(Rats) పట్టి ఇవి తినేస్తుంటాయి. పాములంటే మనలో చాలా భయాలు ఉంటాయి. పాము కాటుకుగురై చనిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా కట్ల పాటు, తాచుపాములు కాటేస్తే సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే పాములు తిరుగుతున్నాయన్న అనుమానం వస్తే అటుగా ఎవరూ వెళ్లరు. పొరపాటున మన కాలు దానికి తగిలితే బుస్సున పడగవిప్పి టపీమని కాటేస్తుంది. దీంతో పాములు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం.
అయితే ఇంటి ఆవరణలో కొన్ని రకాల చెట్లను(Plants) పెంచితే పాములు దరిదాపుల్లోకి కూడా రావంటున్నారు. వాకింగ్ ప్లాంట్(walking Plants), బంతి పూల చెట్లు(Marie Gold Plant), క్లోవ్(Clove), సదాప చెట్టు, బాసిల్, గార్లిక్‌ల చెట్ల(Garlic tree) పెంచితే పాములు అటువైపు వెళ్లవంటున్నారు. ఈ చెట్ల వాసన వాటికి పడకపోవడమే కారణమంటున్నారు. ముఖ్యంగా వీటిలో వాకింగ్ ప్లాంట్‌ను పెంచుకోవాలని చెప్తున్నారు. ఇది గుబురుగా పెరిగి, ప్రత్యేకమైన పొదల తరహాలో పెరగడం దీని ప్రత్యేకత. దీనిని నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసనను పాములు అసలే ఇష్టపడవంటున్నారు. పొలం గట్లు, ఇంటి ఆవరణలో ఇలాంటి చెట్ల పెంచడం వల్ల పాముల బెడద నుంచి తప్పించుకునే అవకాశం కల్గుతుందంటున్నారు.