✕
శృంగారంపై(Romance) ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. సెక్స్‌ను ఇలా చేయాలి, అలా ఆస్వాదించాలి.. ఆ పద్ధతిలోనే చేయాలి అంటుంటారు. సెక్స్‌పై రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ఏ సమయంలో అది చేస్తే బాగుంటుంది, ఇలానే చేయాలని ఎందరో ఎన్నో చెప్తుంటారు కానీ.. వాటికి శాస్త్రీయత(Scientific) ఉండదనేది వైద్య నిపుణుల(Medical experts) భావన. ఈ క్రమంలోనే కొందరికి మరో డౌట్ వస్తుంటుంది. పీరియడ్స్(Periods) సమయంలో సెక్స్ సురక్షితమా.. ఆ సమయంలో పాల్గొంటే తప్పవుతుందా.. లేదా అనే సందేహం పలువురికి కలుగుతుంది. ఆ సయంలో రతిలో పాల్గొంటే పరవాలేదని కొందరు సూచిస్తారు.. మరికొందరు వద్దంటారు.

x
periods romance
-
- ఆ సమయంలో రతిలో పాల్గొన్నా లేకున్నా శుభ్రతకు(Hygiene) ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. నార్మల్ టైమ్‌లో కూడా శుభ్రత ఉంటేనే రతిని ఎంజాయ్(Enjoy) చేస్తారని.. ఇక పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనాలంటే శుభ్రత చాలా ముఖ్యమని అంటున్నారు. దంపతులిద్దరూ(Couple) శుభ్రత పాటిస్తేనే ఆ సమయంలో రతిని ఆస్వాదించవచ్చంటున్నారు. అయితే ఇందుకు ఇద్దరు చర్చించుకోవాలని.. ముందుగా భార్య(Wife) అంగీకారం ఉండాలంటున్నారు.
-
- నెలసరి సమయంలో స్త్రీకి(Women) కొన్ని ఇంబందికర పరిస్థితులు వస్తాయని.. ఇద్దరికీ ఇష్టం ఉంటేనే ఆ పనిలో ముందుకెళ్లాలంటున్నారు. పీరియడ్స్ సయంలో చాలా మంది స్త్రీలకు వేర్వేరు సమయాల్లో శరీరంలో మార్పులు వస్తాయంటున్నారు. కొందరికి ఉదయం పూట మూడ్(Mood) ఉంటే.. మరికొందరికి మరో సమయంలో మూడ్ వస్తుందని.. ఆ సమయాన్ని(Time) బట్టి ప్రవర్తించాలని చెప్తున్నారు. అంతేకానీ మీ భాగస్వామిని బలవంతపెట్టి రతిలో పాల్గొంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
-
- ఈ సమయంలో సెక్స్‌లో రకరకాల భంగిమల్లో పాల్గొని ప్రయోగాలు(Experiments) చేయొద్దంటున్నారు. ఇద్దరికీ అంగీకార భంగిమలోనే పాల్గొనాలంటున్నారు. వివిధ రకాల బంగిమల్లో పాల్గొంటే రక్తస్రావం అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు.
-
- పీరియడ్స్ సమయంలో మహిళ పలు సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా, మానసికంగా(Physocologically) కొంత ఇబ్బందికరంగా ఉంటారు. అయితే కొందరు ఈ సమయంలో రతి క్రీడలో పాల్గొంటే చాలా రిలాక్స్(Relax) ఫీల్ అవుతారని చెప్తున్నారు. వాస్తవానికి స్త్రీలే ఈ సమయంలో శృంగారాన్ని కోరుకుంటారని చెప్తున్నారు. 55 శాతం(55%) మంది స్త్రీలు ఈ సమయంలో శృంగారాన్ని కోరుకుంటే.. 45 శాతం(45%) మంది అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
-
- సంభోగంలో పాల్గొన్న సమయంలో ఆక్సిడోసిన్(Auxidosin) అనే హార్మన్ రిలీజ్ అవుతందని.. దీనినే బాండింగ్ హార్మోన్(Bonding hormon) అని కూడా అంటారని చెప్పారు. అంతేకాకుండా మరో హార్మోన్ ఎండోమార్మిన్(Endomarmin) రిలీజ్ అవుతందని చెప్పారు. ఈ సమయంలో సంభోగంలో పాల్గొంటే ఇవి అధిక స్థాయిలో రిలీజ్ అవుతాయని... పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు(Pain), తిమ్మిర్ల బాధను ఇవి తగ్గిస్తాయంటున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే అధిక రక్తస్రావం కాకుండా నివారించవొచ్చని చెప్తున్నారు
-
- ఈ సమయంలో అందరు మహిళలు ఒకేలా స్పందిస్తారని అంచనా వేయొద్దని.. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారని దీనిని గుర్తెరిగి మగవారు(Men) నడుచుకోవాలని చెప్తున్నారు. ఈ క్రమంలో మహిళలపై ఒత్తిడి(Stress) పెంచి వారిని మరింత ఆందోళనకు గురిచేయకూడదని.. వారితో తీరిగ్గా చర్చించి.. ఆడవారు సమ్మతించాకనే ఈ రతి క్రీడలో పాల్గొనాలని సూచిస్తున్నారు.
-
- ఒకరి అభిప్రాయాలు(opinion) ఒకరు స్పష్టంగా చెప్పుకోవాలని.. ఒకరి అభిప్రాయాలను బలవంతంగా మరొకరిపై రుద్దకూడదని అంటున్నారు. అవసరమైతే ఒక సారి డాక్టర్‌ను సంప్రదించి.. ఆ తర్వాత శృంగారంలో పాల్గొనాలా వద్దా అన్న అభిప్రాయానికి రావాలని నిపుణులు చెప్తున్నారు.

Ehatv
Next Story