పాకిస్తాన్‌(Pakistan) మాజీ క్రికెటర్‌ సయీద్‌ అన్వర్‌(Saeed Anwar) మహిళా సాధికారత, స్త్రీ ఆర్ధిక స్వేచ్ఛలపై నోరుపారేసుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన మహిళలు(Women) బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం వల్లే సమాజానికి ఈ దుస్థితి వచ్చిందని అన్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్‌(Pakistan) మాజీ క్రికెటర్‌ సయీద్‌ అన్వర్‌(Saeed Anwar) మహిళా సాధికారత, స్త్రీ ఆర్ధిక స్వేచ్ఛలపై నోరుపారేసుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన మహిళలు(Women) బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం వల్లే సమాజానికి ఈ దుస్థితి వచ్చిందని అన్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్లతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా తాను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నానని, కొద్ది రోజుల కిందటే ఆస్ట్రేలియా(Australia), ఐరోపా(Europe) నుంచి వచ్చానని, యువకులు కుంగుబాటుకు లోనవుతున్నారని సయీద్‌ అన్వర్‌ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ వీడియోలో ఏమన్నాడంటే 'కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. భార్యభర్తలు గొడవలు పడుతున్నారు. డబ్బు కోసం మహిళలను పనికి పంపించడం వల్లే ఇదంతా' అని అన్నాడు. అన్నట్టు ఈ వివాదంలోకి అతడు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను కూడా తీసుకొచ్చాడు. 'ఇదే విషయమై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ నాకు ఫోన్‌ చేశాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాడు. మా మహిళలు పనిచేయడానికి బయటకు వచ్చిన తర్వాతే మా సంస్కృతి నాశనమైందని ఒక ఆస్ట్రేలియా మేయర్‌ నాతో అన్నాడు' అంటూ సయీద్‌ అన్వర్‌ చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్నాళ్లుగా పాకిస్తాన్‌ విడాకుల సంఖ్య పెరగడానికి మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడమేనని అన్వర్‌ చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. స్త్రీవాదులు మాత్రం అన్వర్‌పై మండిపడుతున్నారు.

Updated On 16 May 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story