శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత(Bhagavad Gita) మహాభారత ఇతిహాసంలో ముఖ్యమైన భాగం. అచ్చమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయలతో 700 శ్లోకాలతో(Quotes) ఉంది. ఇందులోని శ్లోకాలు శోకాన్ని దూరం చేస్తాయి. పఠించిన వారిని స్థిత ప్రజ్ఞులను చేస్తాయి. అంతే కాదు గీత మానసిక ఉల్లాసన్నా పెంపొందించుతుంది.
శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత(Bhagavad Gita) మహాభారత ఇతిహాసంలో ముఖ్యమైన భాగం. అచ్చమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయలతో 700 శ్లోకాలతో(Quotes) ఉంది. ఇందులోని శ్లోకాలు శోకాన్ని దూరం చేస్తాయి. పఠించిన వారిని స్థిత ప్రజ్ఞులను చేస్తాయి. అంతే కాదు గీత మానసిక ఉల్లాసన్నా పెంపొందించుతుంది. శారీరక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ విషయం తాజా అధ్యయనంలో తేలింది. రోజూ గీతను వింటే మధుమేహం(Diabetes) మటుమాయం అవుతుందని అంటున్నారు ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి(Osmania General Hospital) చెందిన ఎండోక్రినాలజీ(Endocrinology) డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ రాకేశ్ సహాయ్(Rakesh Sahay). ఎటువంటి వైద్య సదుపాయాలు లేని సమయంలోనే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలనే విషయాన్ని గీతలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు వివరించాడని రాకేశ్ సహాయ్ చెబుతున్నారు. కచ్చితమైన డైట్‌తో పాటు కాసింత ఎక్సర్‌సైజ్ చేస్తూ భగవద్గీతను వింటే రోగాలు దూరం అవుతాయని అంటున్నారు. భారత్‌లోని పలు ఆసుపత్రుల వైద్యులు, ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్ డాక్టర్లు, పాక్‌లోని ఆగాఖాన్ యూనివర్సిటీ వైద్యులు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని తేల్చారని రాకేశ్ పేర్కొన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదని, జీవితంలోని ప్రతీ అంశాన్ని వివరించే గ్రంథమని చెప్పారు.