లాభాలు: శారీరక, మానసిక సంతృప్తి: ఓరల్ సెక్స్ భాగస్వాముల మధ్య లైంగిక సంతృప్తిని పెంచుతుంది.

లాభాలు: శారీరక, మానసిక సంతృప్తి: ఓరల్ సెక్స్ భాగస్వాముల మధ్య లైంగిక సంతృప్తిని పెంచుతుంది. ఇది ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది, ఇవి ఆనందం, ఒత్తిడి తగ్గిస్తాయి. మానసిక శాంతిని అందిస్తాయి. అధ్యయనాల ప్రకారం లైంగిక కార్యకలాపాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తాయి. ఓరల్ సెక్స్(Oral Sex) భాగస్వాముల మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుంది. ఇది విశ్వాసం, ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంచుతుందని జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్(Journal of Sex Research) (2019)లో పేర్కొన్నారు. కొందరు దీన్ని సెక్స్‌లో వైవిధ్యంగా, సరదాగా భావిస్తారు, దీనివల్ల సంబంధంలో ఉత్సాహం పెరుగుతుంది. ఓరల్ సెక్స్ గర్భధారణకు దారితీయదు, కాబట్టి ఇది గర్భనిరోధక పద్ధతులు లేకుండా సురక్షితమైన ఆప్షన్‌గా ఉంటుంది. గర్భం గురించి ఆందోళన లేని వారికి ఇది ఒక ప్రత్యామ్నాయం. ఇది తక్కువ స్థాయిలో శారీరక శ్రమను కలిగిస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది హృదయ ఆరోగ్యానికి కొంతమేర సహాయపడొచ్చు
నష్టాలు: ఓరల్ సెక్స్ వల్ల నోటి ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్లు సంక్రమిస్తాయి, హెర్పెస్ (HSV-1, HSV-2) నోటి లేదా జననాంగ హెర్పెస్ ఉంటే, ఓరల్ సెక్స్ ద్వారా మరొకరికి సోకుతుంది. దీనివల్ల నోటిలో బొబ్బలు, నొప్పి వస్తాయి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ దీనివల్ల గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సెంట్రల్ ఫర్ డిసీజ్ ప్రకారం, HPV ఓరల్ సెక్స్ ద్వారా నోటికి సంక్రమిస్తుంది, ముఖ్యంగా బహుళ భాగస్వాములతో ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. గొనోరియా, క్లామిడియా: ఇవి గొంతులో ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి, దీన్ని "Pharyngeal Gonorrhea" అంటారు. లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ చికిత్స చేయకపోతే సమస్యలు పెరుగుతాయి. నోటిలో గాయాలు లేదా రాషెస్ రూపంలో కనిపిస్తుంది. నోటి శుచిత్వం సరిగా లేకపోతే లేదా భాగస్వామికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే, నోటిలో గాయాలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లాంటివి సంక్రమించొచ్చు.
ఒక భాగస్వామి సౌకర్యంగా లేకపోతే లేదా ఒత్తిడిలో చేస్తే, అది అసౌకర్యం, అపరాధ భావన, ఆత్మగౌరవం తగ్గడానికి దారితీస్తుంది. సైకాలజీ టుడే (2021) ప్రకారం, సమ్మతి లేని లైంగిక కార్యకలాపాలు సంబంధంలో ఒడిదుడుకులను తెస్తాయి. భారతదేశంలాంటి సంప్రదాయ సమాజాల్లో ఓరల్ సెక్స్ గురించి చర్చించడం లేదా ఆచరించడం ఇప్పటికీ అపవాదుగా భావిస్తారు. ఇది వ్యక్తిగత లేదా సామాజిక ఒత్తిడిని కలిగిస్తుంది.
కండోమ్‌లు (పురుషులకు), డెంటల్ డ్యామ్‌లు (స్త్రీలకు) వాడితే STIల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. వైరస్, బ్యాక్టీరియా సంక్రమణను అడ్డుకుంటాయి. ఫ్లేవర్డ్ కండోమ్‌లు లేదా లూబ్రికెంట్లు ఓరల్ సెక్స్‌ను సౌకర్యవంతంగా చేస్తాయి. భాగస్వాములిద్దరూ శుభ్రత పాటించడం, జననాంగాలు, నోటిని కడుక్కోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా టెస్ట్‌లు చేయించుకోవడం మంచిది. ఇన్ఫెక్షన్ ఉంటే త్వరగా చికిత్స తీసుకోవచ్చు. HPV వ్యాక్సిన్ (Gardasil) తీసుకోవడం వల్ల గొంతు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఇద్దరి సమ్మతి, సౌకర్యం ఉంటేనే దీన్ని ఎంచుకోవాలి. బలవంతం లేదా ఒత్తిడి ఉండకూడదు. ఓరల్ సెక్స్ వల్ల లాభాలు (సంతృప్తి, సాన్నిహిత్యం), నష్టాలు (ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ రిస్క్) రెండూ ఉన్నాయి
