ఉల్లి(onions) చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి గడ్డ ఎంత చలవంటే.. ఒంట్లో వేడిని హరించి వేస్తుంది ఉల్లి. అటువంటి ఉల్లి చేసే మేలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉల్లి(onions) చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ఉల్లి గడ్డ ఎంత చలవంటే.. ఒంట్లో వేడిని హరించి వేస్తుంది ఉల్లి. అటువంటి ఉల్లి చేసే మేలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉల్లిగడ్డను వంటకే కాదు. మన శరీరంలో కలిగే అనేక సాధారణ రోగాలకు మందుగా కూడా వాడవచ్చు. ముఖ్యంగా వేసవికాలం(Summer) ఉల్లి ఎక్కువగా తీసుకుంటే ఒంట్లో ఉన్న ఉష్ణం(Heat) ఉఫ్ అని వెళ్ళిపోతుంది.

శీతాకాలంలో జలుబు(cold), దగ్గు(Cough), సైనస్(sinus) ఇబ్బంది పెడుతూంటాయి. ఈ సమయంలో ఒక చెంచా తేనెతో(honey) ఉల్లిపాయ రసం కలిపి పుచ్చుకుంటే
ఉపశమనంగా వుంటుంది.

మోకాళ్లనొప్పులు(Knee pains) తగ్గాలంటే రెండు చెంచాల ఉల్లిరసం త్రాగి, ఆవనూనెలో వేడిచేసిన ఉల్లిపాయను చిదిపి మోకాళ్లపైన వేసి కట్టు కడుతూ ఉంటే
ఉపశమనం లభిస్తుంది.

మనకు ఎక్కడైనా పురుగులు కుట్టినచోట ఉల్లిపాయరసం, తేనె కలిపి రాస్తే బాధ తగ్గుతుంది. రోజూ 50 గ్రాముల వరకూ తీసుకుంటే నీటి ద్వారా సంక్రమించే గ్యాస్ట్రో ఎంటరైటిస్, డయేరియా, డిసెంట్రీ వంటివి రావు.

చిగుళ్ళవాపులు, పిప్పిపళ్ళు, నోటిపూత గలవారు అరకప్పు గోరువెచ్చని నీటిలో ఓ చెంచా ఉల్లిరసం, అరచెంచా వెనిగర్ కలిపి పుక్కిలిస్తే మంచి ఫలితం కనిపనిస్తుంది.

అంతే కాదు ఎవరైనా చర్మవ్యాధులున్నవారు రోజూ ఒకటి రెండు చెంచాల ఉల్లిరసాన్ని తీసుకుంటే.. మొత్తం కాకపోయినా.. కాస్తలో కాస్త ఫలితం కన్పిస్తుంది. అయితే, కొందరికి సల్ఫర్ వల్ల ఎలర్జీ వస్తూంటుంది.అటువంటివారు ఇది పాటించరాదు. ఇలా ఉల్లి మనకు చాలా మేలు చేస్తుందిఇందులో కొన్నైనా పాటించండి మంచి జరుగుతుంది.

Updated On 17 April 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story