Facebook Profile : మీ Facebook ప్రోఫైల్ ఎవరు చూస్తున్నారో ఇలా తెలుసుకోవచ్చు..
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం ఎంత వేగంగా పనిచేస్తుందో చెప్పక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా నెట్టింట రీల్స్(Reels), వీడియోస్(Videos) అంటూ సందడి చేస్తున్నారు ప్రజలు. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో Facebook ఒకటి. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు కోట్లాది మంది ఇందులో యాక్టివ్‌గా ఉంటారు. ఇక మీరు Facebook ఉపయోగిస్తే చాలా మంది మీ ప్రొఫైల్‌ని చూస్తుంటారు. కానీ మీ ప్రొఫైల్‌ను ఎవరు రహస్యంగా చూస్తున్నారు అనేది మీరు తెలుసుకోలేరు.
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం ఎంత వేగంగా పనిచేస్తుందో చెప్పక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా నెట్టింట రీల్స్(Reels), వీడియోస్(Videos) అంటూ సందడి చేస్తున్నారు ప్రజలు. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో Facebook ఒకటి. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు కోట్లాది మంది ఇందులో యాక్టివ్‌గా ఉంటారు. ఇక మీరు Facebook ఉపయోగిస్తే చాలా మంది మీ ప్రొఫైల్‌ని చూస్తుంటారు. కానీ మీ ప్రొఫైల్‌ను ఎవరు రహస్యంగా చూస్తున్నారు అనేది మీరు తెలుసుకోలేరు. కానీ ఇప్పుడు హై-ఫై ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రతి మూలకు చేరుకుంది. సోషల్ మీడియా కూడా అదే వేగంతో ప్రజాదరణ పొందుతోంది. అయితే మీ ఫేస్ బుక్ ప్రోఫైల్ ఎవరు చూశారు అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు.దీని కోసం ఫేస్‌బుక్ ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను రూపొందించలేదు. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మీ FBని ఎవరు చూశారో మీరు తెలుసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందామా.
1. ముందుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి. ఆ తర్వాత 'రైట్ క్లిక్' చేయాలి. అక్కడ మీకు 'వ్యూ పేజ్ సోర్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
2. వ్యూస్ పేజీ పై క్లిక్ చేసిన తర్వాత మీరు పేజీ సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అందులో 'BUDDY_ID' అనే ఆప్షన్ కోసం వెతకండి. దీని కోసం Control+F (ctrl+F) క్లిక్ చేయొచ్చు.. అలాగే 'BUDDY_ID' అని టైప్ చేసి ఎంటర్ పై క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు అనేక Facebook ప్రొఫైల్ IDలు 'BUDDY_ID' పక్కన కనిపిస్తాయి. అందులో ఒకరి IDని కాపీ చేయండి.
4. కొత్త ట్యాబ్‌ని తెరిచి కాపీ చేసిన IDని Facebook.com లేదా మీరు సెలక్ట్ చేసుకున్న IDలో యాడ్ చేసి ఎంటర్ నొక్కండి.
ఈ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ వ్యూయర్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫేస్‌బుక్‌ను ఎవరు చూసారో వారికి తెలియకుండానే ఈ సింపుల్‌గా మీరు తెలుసుకోవచ్చు.