పూర్వకాలం నుంచి వేప(Neem) సర్వ గుణాలు కలిగిన ఔషదిగా పరిగణించబడుతుంది. వేపలో ఉన్న మెడిసిన్ గుణాలు రకరకాల వ్యాధుల నుంచి మనిషిని రక్షిస్తున్నాయి. ఈ వేపచెట్టులోనిఆకు, కాయ, కొమ్మ, అన్నీ ఔషదాలతో నిండి ఉండటంతో.. అది మనిషికి రకరకాలుగా ఉపయోగపడుతుంది.

వేప ఆకులు చర్మ వ్యాధులకు(Skin Disease) ఉత్తమ ఔషదం. వేప ఆకు చర్మంపై ఇన్ ఫెక్షన్స్(Infection) ను నయం చేస్తుంది. వైరస్ వల్ల వచ్చే ఫీవర్(Fever) తో పాటు కుష్టు వ్యాధి, మూత్ర సంబంధిత వ్యాధులకు వేప మంచి ఫలితాలను ఇస్తుంది.
వేప రక్తం గడ్డకట్టడం, ప్రేగులలోని పురుగులు మరియు మూత్రపిండాల(Kidney) సమస్యలను నయం చేస్తుంది. అన్ని వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉంది.
వేపపిండిని స్నానంనికి ముందు నలుగు పిండిగా పెట్టడం, వేపాకు మరిగించిన నీటితో స్నానం చేయడం.. వేపఆకు రుద్దితే పుండ్లు నయమవుతాయి. వేప పుల్లలతో రోజుకు రెండు సార్ల బ్రష్ చేయడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోయి దంతాలకు బలం చేకూరుతుంది.
వేప పండును గ్రైండ్ చేసి రసం తీసి చర్మపు పుండ్లు, దద్దుర్లు(Rashes), గజ్జి(Allergy) మీద రాస్తే ఉపశమనం లభిస్తుంది.వేప గింజలను గ్రైండ్ చేసి శరీరంలోని పుండ్లకు రాసుకుంటే ఇన్ఫెక్షన్స్ సోకిన రోగకారక క్రిములు దాడి చేయవు.
అంతే కాదు వేపాకులను పురుగుల, దోమల నివారణ గా కూడా వాడవచ్చు. బియ్యం, పప్పుల డబ్బాల్లో వేపాకు ఉంచితే పురుగు పట్టదు. వేపాకు నిప్పుల మీద వేసి లైట్ గా పొగ వచ్చేలా చేస్తే.. చుట్టుపక్కల(Mosqitoes) దోమలు ఉండవు. ఇలా వేపతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.