ముఖం మీద నల్ల మచ్చలు(Dark Spots) రావడం సహజం, ముఖ్యంగా యుక్త వయస్సు రాగానే ముఖంపై మొటిమలు(Pimple) వస్తుంటాయి. కొంతమందికి నల్లని మంచ్చలు కూడా ఏర్పడతాయి. ఇది సర్వ సాధారణమే.అయితే కొంతమందికి త్వరగా తగ్గిపోతాయి కాని మరికొంత మందిలో మాత్రం

ముఖం మీద నల్ల మచ్చలు(Dark Spots) రావడం సహజం, ముఖ్యంగా యుక్త వయస్సు రాగానే ముఖంపై మొటిమలు(Pimple) వస్తుంటాయి. కొంతమందికి నల్లని మంచ్చలు కూడా ఏర్పడతాయి. ఇది సర్వ సాధారణమే.అయితే కొంతమందికి త్వరగా తగ్గిపోతాయి కాని మరికొంత మందిలో మాత్రం
వయస్సు పెరిగే కొద్దీ తగ్గకుండా అలా పెరుగుతూనే ఉంటాయి. అవి సమస్యగా తయారవుతాయి.

ఇక వాటి వల్ల బయటకు వెళ్ళడానికే ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారిలో ఎలాంటి హల్లోపతి మందులు.. కాస్మొటిక్స్, సర్జరీలు లేకుండా.. వాడకుండా ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలతో తొలగించుకోవచ్చు. మరి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.తాజా టమోటా రసాన్ని(Tomato Juice) రాత్రి సమయంలో నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. వాటి వల్ల డెడ్ సెల్స్ పోతాయి. ముఖం ఫ్రెష్ గా తయారవుతుంది.

మనం మసాలా దినుసుగా వాడే దాల్చినచెక్కతో.. ఈ మచ్చలు వదిలించుకోవచ్చు..రెండు స్పూన్ల నిమ్మరసంలో(Lemon Juice) సరిపడా దాల్చినచెక్క పొడిని(cinnamon powder) వేసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

మెంతి ఆకులను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకొని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.రెండు స్పూన్ల పుదీనా రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే నాళాల్ని మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా చేయటం వలన నల్లని మచ్చలతో పాటు మృతకణాలు కూడా తొలగిపోతాయి. ముఖం అందంగా.. తాజాగా వెలుగుతుంది.

Updated On 9 Sep 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story