చాలా మందికి ఒళ్లంతా తెల్లగా ఉంటుంది కాని మోచేతులు(Elbow) మాత్రం నల్లగా ఉంటాయి.. మోకాల్లు(Knee) కూడా నల్లగా కనిపిస్తాయి. మరి అవి తెల్లగా మారాలంటే.. డబ్బులు పోసి క్రీములు గట్రా వాడకంటి.. ఇంట్లో ఉన్న పదార్ధాలతో వాటిని తెల్లగా మార్చుకోవచ్చు చూసుకోండి.

చాలా మందికి ఒళ్లంతా తెల్లగా ఉంటుంది కాని మోచేతులు(Elbow) మాత్రం నల్లగా ఉంటాయి.. మోకాల్లు(Knee) కూడా నల్లగా కనిపిస్తాయి. మరి అవి తెల్లగా మారాలంటే.. డబ్బులు పోసి క్రీములు గట్రా వాడకంటి.. ఇంట్లో ఉన్న పదార్ధాలతో వాటిని తెల్లగా మార్చుకోవచ్చు చూసుకోండి.

కొందరికి మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉంటాయి. దీనివల్ల ఇష్టమైన డ్రెస్ లు ఎన్ని ఉన్నా మోచేతి పైన ఉన్న దుస్తులు పక్కన పెట్టేస్తారు. అంతేకాదు దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఇవి రావడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ఈ సమస్యను దూరం చేస్తాయి. ఇప్పుడు దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఒక టీస్పూన్ పెరుగులో(Perugu) చిటికెడు పసుపు(Turmeric) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి మోచేతిపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

అలోవెరా జెల్(Alovera gel) మరియు తేనెను(Honey) సమాన పరిమాణంలో తీసుకుని రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై అప్లై చేసి కొంత సమయం తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఒక టీస్పూన్ పెరుగు తీసుకుని దానికి ఒక టీస్పూన్ ఓట్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులపై రాయండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

మీరు నల్లగా ఉన్న మీ మోచేతులు మరియు మోకాళ్లపై కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను అప్లై చేయవచ్చు. ఇవి నలుపు రంగును తొలగించి శరీర రంగులోకి మార్చడంలో సహాయపడతాయి.

ఒక టీస్పూన్ పెరుగు మరియు ఒక టీస్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకుని మీ మోచేతులపై అప్లై చేయండి. కాసేపు మసాజ్ చేయండి. ఇలా నిరంతరం చేస్తే మోచేతి రంగు తెల్లగా మారుతుంది.

నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి అందులో పంచదార చల్లి కాసేపు నానబెట్టి మోచేతులపై రాయాలి. ఇది మోచేయి నలుపు రంగును కూడా తొలగిస్తుంది.

Updated On 5 Feb 2024 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story