ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్య జుట్టు ఊడిపోవడం(Hair fall). చిన్నవయసులోనే జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం(Grey hair) చూస్తుంటాం. దీంతో యువతీ యువకుల్లో ఆందోళన వస్తుంది. జుట్టు విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం ఖరీదైన చికిత్సలు కూడా తీసుకుంటుంటారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జీన్స్‌ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. ఇంట్లోనే నేచురల్‌గా తయారుచేసిన ఆయిల్‌ వల్ల జుట్టు ఒత్తుగా పెంచుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

కరివేపాకు(Curry leaves), మందార ఆకులు, వేప ఆకులు(Neem Leaves), గోరింటాకుతో(Henna) కలిపిన నూనెను(Oil) వాడితే అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయంటున్నారు. ఈ నూనెతో జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెప్తున్నారు. అయితే నేచురల్‌ పద్ధతిలో నూనె తయారుచేయడం వల్ల నూనె రాసిన కొన్ని రోజుల్లోనే ప్రయోజనం ఉండదని.. కొంత కాలం వేచి ఉంటేనే ప్రయోజనాలు దక్కుతాయని అంటున్నారు. పార్లర్‌లో దొరికేవాటిని వాడకూడదని.. వాటిలో కెమికల్స్‌ ఉండడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని చెప్తున్నారు.

మందార ఆకులను పేస్టులా చేసి జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు మృదువుగా మారుతాయి. మందార ఆకులు, గోరింట ఆకులు, వేప ఆకులను కలిపి రుబ్బుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టింటి గంటపాటు వదిలేయాలి. ఇది తలలో దురదను కూడా తగ్గిస్తుంది. ఈ పేస్టులో పెరుగును కూడా జత చేసుకోవచ్చు. గంట తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్‌ డ్రైయర్‌లాంటివి వాడకుండా జుట్టును తనంతట తనే ఆరేలా చూసుకోవాలి. మరో రెమెడీ కరివేపాకును మెత్తగా రుబ్బి పేస్టులా చేసి కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. అది చల్లబడిన తర్వాత తలకు పట్టించాలి. గంటపాటు ఉంచిన తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Updated On 1 March 2024 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story