Nail Polish Remover Accident : నెయిల్ పాలిష్ రిమూవర్‌తో జాగ్రత్త...చాలా ప్రమాదకరం!
నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ను(Nail Polish remover) ఉపయోగిస్తాం కదా! దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇలాంటి చేదు అనుభవం ఓ చిన్నారికి ఎదురయ్యింది. అమెరికాలో(America) జరిగిన ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాలోని ఓహియోకు(Ohio) చెందిన 14 ఏళ్ల కెన్నడి(Kennedy) అనే బాలిక ఓ కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ను తొలగించుకుంటోంది.
నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్‌ను(Nail Polish remover) ఉపయోగిస్తాం కదా! దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఇలాంటి చేదు అనుభవం ఓ చిన్నారికి ఎదురయ్యింది. అమెరికాలో(America) జరిగిన ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాలోని ఓహియోకు(Ohio) చెందిన 14 ఏళ్ల కెన్నడి(Kennedy) అనే బాలిక ఓ కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ను తొలగించుకుంటోంది. అందుకు ఆమె నెయిల్ పాలిష్ రిమూవర్‌ను ఉపయోగిస్తోంది. తన మంచానికి దగ్గరలో కొవ్వొత్తి ఉన్నా ఆ పాప ఏమీ కాదనుకుంది. అయితే నెయిల్ పాలిష్ రిమూవర్ ఆవిరికి దగ్గరలో కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భయంతో చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ బాటిల్‌ను వదిలేసింది. అది పగలడంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. అక్కడ ఉన్న వస్తువులన్నింటికీ మంటలు అంటుకున్నాయి. పాపం చిన్నారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. హఠాత్పరిణామంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. కెన్నడి అరుపులతో అలర్టయిన తల్లిదండ్రులు వెంటనేఆమె బెడ్‌రూమ్‌కి వెళ్లారు. గది అంతా పొగలు కమ్ముకున్నాయి. చిన్నారేమో మంటల్లో చిక్కుకుని ఉంది. వారు కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేశారు. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ పాప చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు, రెండు తొడలు, కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయా భాగాలకు ఎక్సిషన్ అనే శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా శరీర భాగాలకు అయిన గాయాలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని డాక్టర్లు చెప్పారు.