జగదేకవీరుని కథ సినిమాలో కథానాయకుడు పాటతో రాయిని కరిగిస్తాడు! అది సినిమా..! నిజంగా సంగీతానికి రాళ్లు కరుగుతాయా ఏమిటీ? అని కొందరు అనుకోవచ్చు కానీ సంగీతానికి ఆ శక్తి ఉంది. సంగీతానికి శిశువులు, పశువులు చివరాఖరికి పాములు కూడా తలలాడిస్తాయన్న నానుడి ఉండనే ఉంది.

జగదేకవీరుని కథ సినిమాలో కథానాయకుడు పాటతో రాయిని కరిగిస్తాడు! అది సినిమా..! నిజంగా సంగీతానికి రాళ్లు కరుగుతాయా ఏమిటీ? అని కొందరు అనుకోవచ్చు కానీ సంగీతానికి ఆ శక్తి ఉంది. సంగీతానికి శిశువులు, పశువులు చివరాఖరికి పాములు కూడా తలలాడిస్తాయన్న నానుడి ఉండనే ఉంది. ఈ మధ్యన పెద్ద పెద్ద ఆపరేషన్లను కూడా ఎలాంటి మత్తు ఇంజెక్షన్‌ (అనస్థీషియా) ఇవ్వకుండానే కేవలం సంగీతం వింటూ చేయించుకున్న వార్తలను కూడా మనం చదివాం! సంగీతంతో కొన్ని రోగాలు నయం అవుతాయని పరిశోధనలో తేలింది. మనసు బాగోలేకపోతే ఓదార్చేది పాటే! ముప్పిరిగొన్న ఆనందంలో వచ్చేది పాటే! అలలు కదిలినా పాటే.. ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే అని వేటూరి రాసింది అక్షర సత్యం. అసలు సంగీతం అంటే ఇష్టం లేనిదెవరికి? చెట్లు కూడా సంగీతంతో హుషారు తెచ్చుకుంటాయట! సంగీతంతో బోల్డన్ని ప్రయోజనాలున్నాయి. గుండె పనితీరు సక్రమంగా ఉండాలంటే రోజూ సంగీతం వినాలని పరిశోధకులు అంటున్నారు. ప్రతి రోజు ఓ అరగంట పాటు ఇష్టమైన పాటో, ఇష్టమైన సంగీతమో వినడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుందని చెబుతున్నారు. సంగీతం వింటూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే గుండె బలంగా తయారవుతుంది. ఇలా చేయటం వల్ల గుండెకు మేలు కలిగించే ఎండార్ఫిన్లు శరీరంలో విడుదలవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అందులోంచి బయటపడటానికి సంగీతమే అత్యుత్తమ ఔషధం. మానసిక ఒత్తిళ్లను దూరం చేసేది కూడా మ్యూజిక్కే!సంగీతం వినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది! నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయని, ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయని పరిశోధకులు చెబుతున్నారు. సంగీతం వల్ల అల్జీమర్స్ వంటి సమస్యలు చాలా వరకూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

Updated On 15 Nov 2023 5:54 AM GMT
Ehatv

Ehatv

Next Story