Onion Serum For Hair Growth : జుట్టు ఎక్కువగా రాలిపోతుందా..? ఉల్లిపాయ సీరంతో చెక్ పెట్టండిలా..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. వాతావరణ మార్పులు.. సరైన ఆహారం తీసుకోకపోవడం.. నిద్ర సరిగ్గా లేకపోవడం.. ఒత్తిడి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. మఖ్యంగా మహిళలలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. మానసిక సంఘర్షణ, జంక్ ఫుడ్ తీసుకోవడం.. అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం కారణాలు కావొచ్చు. అలాగే కెమికల్ షాంపూలు ఉపయోగించడం .. జుట్టును వదిలేయడం వల్ల వెంట్రుకలు బలహీనంగా మారతాయి.
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుంది. వాతావరణ మార్పులు.. సరైన ఆహారం తీసుకోకపోవడం.. నిద్ర సరిగ్గా లేకపోవడం.. ఒత్తిడి కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. మఖ్యంగా మహిళలలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. మానసిక సంఘర్షణ, జంక్ ఫుడ్ తీసుకోవడం.. అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగించడం కారణాలు కావొచ్చు. అలాగే కెమికల్ షాంపూలు ఉపయోగించడం .. జుట్టును వదిలేయడం వల్ల వెంట్రుకలు బలహీనంగా మారతాయి. హెయిర్ ఫాల్ తగ్గించడం కోసం ఎన్నో ప్రయాత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే అనేక రకాల ఆయిల్స్.. సీరమ్స్.. విటమిన్ క్యాప్సుల్స్ ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదు. జుట్టు ఎక్కువగా రాలిపోవడం వేధిస్తున్న వారు ఉల్లిపాయ సీరమ్ తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. నిజానికి ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయ సీరమ్ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఉల్లిపాయ సీరమ్ చేయడానికి కావాల్సినవి..
* ఉల్లిపాయ ఒకటి.
* కొబ్బరి నూనే.. 2 టేబుల్ స్పూన్స్..
* ఆముదం.. టీస్పూన్..
ఉల్లిపాయ సీరమ్ చేయాల్సిన పద్దతి..
ముందుగా ఉల్లిపాయను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. అనంతరం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక మస్లిన్ క్లాత్ లేదా ఫైన్ మెష్ స్టయినర్ తీసుకుని ఉల్లిపాయ పేస్ట్ రసాన్ని ఫిల్టర్ చేయాలి. అందులోనే ఉల్లిపాయ రసంతో కొబ్బరి నూనె, ఆముదం కలపాలి. ఆ మిశ్రమం బాగా మిక్స్ అయ్యాక డ్రై క్లీన్ డబ్బాలో వేయాలి. దానిని డ్రాపర్ లేదా గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
హెయిర్ సీరమ్‌ని ఉపయోగించే విధానం..
* ముందుగా జుట్టును శుభ్రం చేసుకోవాలి.. ఆ తర్వాత వెంట్రుకలను చిన్న, చిన్న విభజనలను చేస్తూ వేలు లేదా డ్రాపర్ సహాయంతో తలపై సీరమ్‌ను అప్లై చేయాలి.
* ఇప్పుడు సర్క్యులేషన్ మోషన్‌లో వేళ్లతో తలంతా మసాజ్ చేయాలి. కనీసం 5 నిమిషాల పాటు చేయాలి.
* సీరమ్‌ను తలకు బాగా పట్టించిన తర్వాత కుదుళ్ల నుంచి జుట్టు చివరి వరకు పట్టించాలి.
* అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేయాలి. దీనిని రాత్రింతా తలకు పట్టించవచ్చు.