ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఏ పనులు జరగడం లేదు. ఒకప్పుడు కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు. వినోదం నుంచి ఉపాధి వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. దీంతో ఎవరూ ఫోన్లు వదల్లేని పరిస్థితి. చెప్పాలంటే.. నేటి తరం టీవీ కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఏ పనులు జరగడం లేదు. ఒకప్పుడు కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు. వినోదం నుంచి ఉపాధి వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. దీంతో ఎవరూ ఫోన్లు వదల్లేని పరిస్థితి. చెప్పాలంటే.. నేటి తరం టీవీ కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రీల్స్, షార్ట్స్ అంటూ టైంపాస్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరూ రెండేసి ఫోన్లతో బిజీ బిజీగా మారిపోయారు. ఈ ఫోన్ల వల్ల కంటి చూపు నుంచి బ్రెయిన్ వరకు ప్రతి పార్ట్‌కు నష్టం తప్పదంటూ కొన్ని అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. తాజాగా మరో అధ్యయనం.. ఏకంగా మగతనానికే లింకు పెట్టింది. ఫోన్ల వల్ల పురుషుల వీర్యంలోని స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుందని.. ఫలితంగా వారిలో సంతాన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటూ అప్రమత్తం చేసింది. స్వీస్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో.. రోజుకు 20 సార్లు కంటే ఎక్కువ ఫోన్ ఉపయోగించే పురుషులకు, వారంలో ఒకటి లేదా అంతకంటే తక్కువ వాడేవారికి మధ్య స్పెర్మ్ కౌంట్‌లో తేడాను తెలుసుకున్నారు. తక్కువగా ఫోన్లు ఉపయోగించేవారితో పోల్చితే.. 20 సార్లు కంటే ఎక్కువగా ఫోన్ ఉపయోగించేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లు గమనించారు. మొబైల్ ఫోన్లు విడుదల చేసే మైక్రోవేవ్స్ ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. జెనీవా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సెర్జ్ నెఫ్ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మొబైల్ ఫోన్‌ నుంచి విడుదలయ్యే మైక్రోవేవ్‌లే కారణమా? అవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అవి వృషణాల ఉష్ణోగ్రతను పెంచి.. స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమయ్యే హార్మోన్లను నియంత్రిస్తున్నాయా అనే విషయాలను ఇంకా తెలుసుకోవలసి ఉంది’’ అని చెప్పారు.
ఇప్పటికే కాలుష్యం, ఆహారపు అలవాట్లు.. ఇతరాత్ర కారణాల వల్ల పురుషుల్లో సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. చాలామంది పిల్లల కోసం కష్టపడుతున్నారు. లక్షలు వెచ్చించి మరీ ఐవీఎఫ్ విధానాల్లో పిల్లలను కంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టడీని పురుషులు సీరియస్‌గా తీసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా పురుషులు తమ మొబైల్ ఫోన్లను ప్యాంట్ కింది జేబుల్లో పెట్టుకుంటారు. దానివల్ల బ్యాటరీ నుంచి ఉత్పత్తయ్యే వేడి కూడా మర్మాంగాలకు తగలవచ్చు. అలాగే మొబైల్ సిగ్నల్స్ రిలీజ్ చేసే శక్తి కూడా ఆ చుట్టుపక్కలే ఉంటుంది. కాబట్టి, అబ్బాయిలూ.. ఈ సారి నుంచి ఫోన్లను కింది జేబుల్లో కాకుండా ఏదైనా బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది. అలాగే, దాని వాడకాన్ని తగ్గించడం కూడా అత్యుత్తమం. ఒకప్పుడు మన తాతలు, వారి తాతలు.. దడ దడా పిల్లలను పుట్టించేసేవారు. కానీ, ఈతరం మాత్రం ఒకరిని కనేందుకే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందా అని శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు జరిపితే.. ప్లాస్టిక్ వినియోగం, ఊబకాయం, కాలుష్యం, వ్యాయమం లేకపోవడం, ఆహారపు అలవాట్లే దోషులని తేలింది. కానీ, కచ్చితమైన కారణాన్ని తెలుసుకోలేకపోయారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. గత 50 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 50 శాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో 2005 నుంచి 2018 సంవత్సరాల మధ్య 18 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు గల 2,886 మంది యువకులపై ఈ పరిశోధనలు జరిపారు. ఈ ఐదేళ్లలో కూడా తీస్తే.. మరిన్ని ఆధారాలు లభిస్తాయి. ఎందుకంటే.. ఈ ఐదేళ్లలో మొబైల్ వాడకం రెండింతలు పెరిగింది. కాబట్టి, అబ్బాయిలు.. ఎందుకైన మంచిది.. జర భద్రం.

Updated On 8 Nov 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story