Manipur Vaishnav Holi : మణిపూర్ వైష్ణవుల హోలీ సంబరమే సంబరం... మామూలుగా ఉండదు మరి!
ప్రతి రాత్రి వసంత వెన్నెల రాత్రి అయితే ఎంత బాగుంటుంది! ఈ కోరిక మణిపూర్ (Manipur Holi)లో హోలీ వేడుకలు చూసిన వారెవ్వరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో ఆరు రోజులు పాటు హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిద్యాలు, జానపద పాటలు, సంప్రదాయ నృత్యాలతో ప్రజలు వేడుక చేసుకుంటారు. మణిపూర్ క్యాలెండర్‌లో చివరి నెల అయిన లామ్తాలో వచ్చే నిండు పున్నమినే హోలీగా జరుపుకుంటారు. హోలీని ఇక్కడ యావ్‌షాంగ్ (yaoshang […]
ప్రతి రాత్రి వసంత వెన్నెల రాత్రి అయితే ఎంత బాగుంటుంది! ఈ కోరిక మణిపూర్ (Manipur Holi)లో హోలీ వేడుకలు చూసిన వారెవ్వరికైనా కలిగి తీరుతుంది. మణిపూర్‌లో ఆరు రోజులు పాటు హోలీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిద్యాలు, జానపద పాటలు, సంప్రదాయ నృత్యాలతో ప్రజలు వేడుక చేసుకుంటారు. మణిపూర్ క్యాలెండర్‌లో చివరి నెల అయిన లామ్తాలో వచ్చే నిండు పున్నమినే హోలీగా జరుపుకుంటారు. హోలీని ఇక్కడ యావ్‌షాంగ్ (yaoshang )గా జరుపుకుంటారు. మిగతా ప్రాంతాల్లో హోలికా దహనం ఉన్నట్టుగానే ఇక్కడా ఓ చెడును అగ్నికి ఆహుతి ఇచ్చే సంప్రదాయం ఉంది. వెదురుతో నిర్మించిన ఓ పర్ణశాల వంటి పాకను దహనం చేస్తారు. దీన్ని వారు యావ్‌షాంగ్ మై తాబా (yaoshang mei thaba)గా పిలుచుకుంటారు. రంగుల పండుగకు ఇది నాంది. ఇక్కడ్నుంచే ఆరు రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. అయితే వీరు జరుపుకునే హోలీ కాసింత భిన్నంగా ఉంటుంది. పున్నమి రోజు ఉదయం చిన్నారులు ఇళ్లిళ్లూ తిరిగి బియ్యం, కాయగూరలు సేకరిస్తారు. మరుసటి రోజు పిల్లలు తమ ఇరుగుపొరుగు ఇళ్లకు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు.. వారిచ్చే డబ్బు, కానుకలను స్వీకరిస్తారు. కొందరు రహదారులపై వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ డబ్బు వసూలు చేస్తారు. ఈ తంతును వారు సొల్ మున్బా అంటారు.
మణిపూర్ వైష్ణవుల సంబరమే సంబరం! అక్కడి వైష్ణవాలయాన్ని కొత్త కళను సంతరించుకుంటాయి.. పెద్దలంతా వైష్ణవ భజనలో మునిగిపోతారు. ఆరో రోజు విజయ్ గోవింద ప్రాంగణంలో హాలంగర్‌ను నిర్వహిస్తారు. ఇది కూడా వారికి ఓ పండుగే! కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకే! 1779లో మణిపూర్ మహారాజు రాజర్షి భాగ్యచంద్ర ఈ పండుగను మళ్లీ జనబాహుళ్యంలోకి తెచ్చాడు. ఈ రోజున గోవిందాలయం నుంచి విజయ్ గోవిందాలయం వరకు ప్రజలు పెద్ద ఊరేగింపు తీస్తారు. భజనలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా విజయ్ గోవింద్ టెంపుల్‌కు వెళతారు. నిజానికి ఇది గొప్ప పండుగ. అన్ని కులాలను ఒక్కటిగా చేసే పండుగ. బీద గొప్ప అన్న తేడాలు లేని పండుగ. అందరూ ఒక్కటై ఆనందంగా జరుపుకునే పండుగ. యువతీ యువకులకైతే చెప్పలేనంత ఆనందం. వివిధ ప్రాంతాల్లో యువతీయువకులు చేసే తబల్ చంగ్బా (ThabalChongba) నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది. అరుదుగా లభించే ఈ అవకాశాన్ని వారు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. ఇందుకోసం అమ్మాయిలు విరాళాలు సేకరిస్తారు. అబ్బాయిలేమో నిర్వహణ గట్రా పనులు చూసుకుంటారు. పండుగ సందర్భంగా ఆటల పోటీలు కూడా జరుగుతాయి.. కాసింత విభిన్నంగా ఉండే ఆ క్రీడల్లో పెద్దవాళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు.