✕
సాధారణంగా సంతానలేమీ (Infertility)కి కారణం మహిళలే (Ladies) అని నెపం వారిమీద నెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ రానురాను సంతానలేమీకి మగవారు (Gents) కూడా 50 శాతం కారణమవుతున్నారని అధ్యయనాలు (Surveys) చెప్తున్నాయి. వివాహమైన తర్వాత మూడు నెలల వరకు గర్భం (Pregnency) రాకుంటే వెంటనే వైద్యులను (Doctors) సంప్రదించాలని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

x
male infertility
-
- అయితే మేల్ ఇన్ఫర్టిలిటీని ఎలా గుర్తించాలో కొందరు వైద్య నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మేల్ ఇన్ఫర్టిలిటీ గుర్తించడానికి వైద్యులు మగవారి వీర్యకణాలను (Sperm) పరిశీలిస్తారు. వీర్యకణాల కౌంట్ (Sperm Count), వాటి నాణ్యత (Quality), వాటి వేగాన్ని (Morphology) పరిశీలిస్తారు. వీర్యకణాల పరీక్షల తర్వాత దానికి తగిన చికిత్స అందిస్తారు. అయితే కొందరు మగవారిలో ఇన్ఫర్టిలిటీకి కొందరు డాక్టర్లు సమస్యను గుర్తించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. సరైన కారణం తెలుసుకోకుండా మల్టీ విటమిన్ల (Multy Vitamin) మెడిసిన్ ఇస్తూ వారి సమయాన్ని, డబ్బును వృధా చెస్తున్నారంటున్నారు.
-
- మగవారికి క్లినికల్ టెస్ట్ (Clinical Test) పక్కాగా నిర్వహించాలని సూచిస్తున్నారు. కొందరికి టెస్టీస్ (testes)ఉండవని అలాంటి వారికి ఎన్ని మందులు ఇచ్చినా వీర్యకణాల ఉత్పత్తి కాదని.. దానికి మెడిసిన్ పరిష్కారం కాదని మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పెషలిస్ట్ డాక్టర్లు చెప్తున్నారు. కొందరికి టెస్టీస్ చాలా చిన్న సైజులో ఉంటాయని.. కొందరికి రెండు టెస్టీస్ కాకుండా ఒకటే ఉంటుందని.. ఈ సమస్యలున్నవారికి స్పెర్మ్ ప్రొడక్షన్ కాదని అంటున్నారు. అయితే కొందరికి టెస్టీస్ ఉండాల్సిన సైజ్లో ఉన్నా కానీ వీర్యకణాలు వెళ్లే దారి మూసుకొని ఉంటుందని.. దీని వల్ల వీర్యం రావడం అంటూ ఉండదని చెప్తున్నారు. అలాంటి సమయంలో ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదంటున్నారు. అందుకే సంతానలేమీకి మగవారే కారణమని నిర్ధారణ అయితే మాత్రం మగవారి టెస్టీస్పై కచ్చితంగా క్లినికల్ టెస్ట్లు చేయాలని సూచిస్తున్నారు.

Ehatv
Next Story