తామర పువ్వులు ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు. అవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తామర పువ్వు యొక్క సాధారణ లక్షణం శరీరంలోని వేడిని(Body heat) తగ్గించడం. మరియు ఇది రక్త నాళాలను కూడా నియంత్రిస్తుంది.
ఒక పువ్వు(Flower) గుండె సబంధిత రోగాలు(Heart Diseases) నయం చేస్తుంది అంటే మీరు నమ్ముతారా..? అవును ఇంతకీ ఆ పువ్వు ఏంటి.. ? దాని ఉపయోగం ఏంటో తెలుసా..?
చాలా వరకూ జనాలు కమలాన్ని(Lotus flower) అందమైన పువ్వుగా మాత్రమే చూస్తారు. కాని దానిలో ఉండే ఔషధ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు.
తామర పువ్వులు ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు. అవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తామర పువ్వు యొక్క సాధారణ లక్షణం శరీరంలోని వేడిని(Body heat) తగ్గించడం. మరియు ఇది రక్త నాళాలను కూడా నియంత్రిస్తుంది.
ఈ పువ్వులో ఔషధ గుణాలు ఎక్కువ. ఇది గుండె జబ్బులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఒక కిలో పువ్వును నీడలో ఆరబెట్టాలి. ఒక మట్టి కుండలో ఆరు లీటర్ల శుభ్రమైన నీటిని వేసి రాత్రంతా నాననివ్వండి.
మరుసటి రోజు, బాగా వడకట్టి గాజు పాత్రలో నిల్వ చేయండి. ఈ నీటిలో ఒక ఔన్స్ తీసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ తాగితే గుండె జబ్బులు క్రమంగా తగ్గి పూర్తిగా మాయమవుతాయి. ఇది శరీరం యొక్క అంతర్గత మరియు బాహ్య గాయాలకు అద్భుతమైన నివారణగా ఉపయోగించబడుతుంది.
ఈ కమలం పువ్వు పైత్యాన్ని తగ్గిస్తుంది. తలనొప్పిని కూడా తొలగిస్తుంది. కాకపోతే.. ఆయుర్వేద వైద్యులు సూచించిన దాని ప్రకారం. ఎన్నిరోజులు తీసుకోవాలో.. అన్ని రోజులు తప్పకుండా వాడితే.. ప్రభావం కనిపిస్తుంది.
కమలం పువ్వులను ఎండబెట్టి పొడి చేయండి. రోజూ 5 టీస్పూన్ల పొడిని ఒకటిన్నర కప్పు నీటిలో వేసి ఓవెన్‌లో మరిగించాలి. దీన్ని వడగట్టి అందులో పాలు, పంచదార కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.