ఈ మధ్య కాలంలో ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నవారు లక్షల్లో ఉంటున్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వైద్యరంగ శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టాలని చేసిన ప్రయోగాలు ఫలించాయి

‘Lung Wax’-compressed
ఈ మధ్య కాలంలో ఊపరితిత్తుల క్యాన్సర్ (Lungs cancer) బారిన పడుతున్నవారు లక్షల్లో ఉంటున్నారు. ప్రతి ఏడాది లక్షలాది మంది ఊపరితిత్తుల క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వైద్యరంగ శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టాలని చేసిన ప్రయోగాలు ఫలించాయి. లండన్‌లనోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford University), ఫ్రాన్సిప్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్ (Francis Crick Institute), యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు (University College London)చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్మూలించేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీనికి ' లంగ్ వ్యాక్స్'('Lung Wax')గా పేరు పెట్టారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలను ఇది గుర్తించి వాటిని నిర్మూలించేలా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఊపరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ అని అన్నారు. తొలుత మూడు వేల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టనున్నామని ప్రకటించారు శాస్త్రవేత్తలు.
