కల్పన రాఘవేందర్ ఒక భారతీయ ప్లే బ్యాక్ సింగర్ , డబ్బింగ్ వాయిస్-ఆర్టిస్ట్ , మ్యూజిక్ డైరెక్టర్ మరియు యాక్ట్రెస్ కూడా.

ఆమె ఐదు సంవత్సరాల వయస్సులోనే ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది మరియు 1,500 కి పైగా ట్రాక్‌లను రికార్డ్ చేసింది మరియు భారతదేశం మరియు విదేశాలలో 3,000 ప్రదర్శనలలు ఇచ్చింది. 2010లో, ఆమె మలయాళ టీవీ ఛానల్ ఏషియానెట్ నిర్వహించిన దక్షిణ భారత గాన కార్యక్రమం స్టార్ సింగర్ సీజన్ 5 విజేతగా నిలిచింది.

ఇప్పుడు తన ప్రారంభ జీవితం మరియు నేపథ్యం గురించి తెలుసుకుందాం...

కల్పన ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, టి.ఎస్. రాఘవేంద్ర ఒక ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు మరియు కంపోజర్ , ఆమె తల్లి, సులోచన కూడా ఒక గాయని. ఆమెకు ఒక చెల్లెలు, షెకినా షాన్ (జననం ప్రసన్న రాఘవేందర్) ఉన్నారు, ఆమె ఒపెరా గాయనిగా ప్రసిద్ధి చెందింది.

కల్పన తన కర్ణాటక సంగీత పాఠాలను మధురై టి. శ్రీనివాసన్ వద్ద నేర్చుకుంది. గానంలో ప్రావీణ్యంతో పాటు, ఆమె కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ మరియు ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది.

తన కెరీర్ గురించి చుస్తే...

కల్పన తన సంగీత జీవితాన్ని 5 సంవత్సరాల వయస్సులో ప్రారంభించింది. ఆమె మొదటగా పి. సుశీల, మనో, ఎం. ఎం. శ్రీలేఖ మరియు ఆమె చెల్లెలు ప్రసన్నలతో కలిసి కుటుంబ పాట పాడింది, ఈ పాటను సంగీత దర్శకుడు సాలూరి వాసురావు కంపోజ్ చేశారు.

పెద్దయ్యాక, ఆమె 1999లో సంగీత దర్శకుడు మణి శర్మ ఆధ్వర్యంలో తెలుగు చిత్రం మనోహరంలోని మంగళగౌరికి పాటకు తన గాత్రాన్ని అందించడం ద్వారా పూర్తి స్థాయి ప్లే బ్యాక్ సింగర్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఆమె ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్, కె. వి. మహదేవన్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం మరియు కె. ఎస్. చిత్ర వంటి అనేక మంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ లు మరియు గాయకులతో కూడా పనిచేశారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 స్టేజ్ షోలు ప్రదర్శించిన ఆమె ప్లే బ్యాక్ సింగర్ గా కాకుండా రంగస్థల ప్రదర్శనకారిగా ప్రజలకు సుపరిచితురాలు.

2013లో, కల్పన తన గురువు మధురై టి. శ్రీనివాసన్ గౌరవార్థం నిర్వహించిన నివాళి కచేరీలో ప్రధాన గాయనిగా నిలిచింది.

ఇక బిగ్ బాస్ తెలుగు విషయానికి వస్తే....

కల్పన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో పోటీదారులలో ఒకరిగా పాల్గొంది. ప్రఖ్యాత ప్లే బ్యాక్ సింగర్ కల్పన రాఘవేందర్ ఆత్మహత్యాయత్నం తర్వాత హైదరాబాద్‌లోని నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.



ehatv

ehatv

Next Story