మహిళలు జుట్టు విరబోసుకుని తిరగడం ఈ రోజుల్లో ఓ ఫ్యాషన్ అయిపోయింది. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉండడం పిశాచాలను ఆహ్వానించడమేనంటున్నారు పండితులు(Pandits). అనేక దుష్ట గ్రహాల ఆ సమయంలో ఆవహిస్తాయంటుననారు. జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి(Goddess Lakshmi) అక్క జ్యేష్ట దేవికి(Jestadevi) కూడా ఆహ్వానమే. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు.

అసలు వెంట్రుకలు(Hair), గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే భగవంతునికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎప్పుడూ తమ జుట్టుని విరబోసుకోకూడదు(Loose hair). తలంటు స్నానం చేసిన మహిళలు జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. మహిళలు విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహిస్తాయంటున్నారు.
తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ(Pooja) దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్లడంకానీ, శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. అలా చేస్తే లక్ష్మీదేవి అక్క జ్యేష్ట దేవిని (దరిద్ర దేవత) ఆహ్వానించినట్లేనంటున్నారు. రామాయణంలో(Ramanayana) దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే ఇందుకు ఉదాహరణ అంటున్నారు.
స్త్రీ దేవతలు అందరూ కేశములను పూర్తిగా వదిలినట్టుగా ప్రతిమలు, ఫోటోలు(Photos), మూర్తులలో(Idols) ఉన్నాయి కదా అంటే.. ఏ దేవతా రూపమైన ఆది పరాశక్తి స్వరూపమే. దేవీ భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ, రజో, తమో (స్త్రీ) గుణములు ఆది పరాశక్తి యందు ఉండవు. అమ్మవారు కామారి(కామాన్ని హరించేది) కావున దేవతలకు ఈ నియమం వర్తించదంటున్నారు పండితులు