క్యాన్సర్‌ (Cancer) మహమ్మారితో 2019లో భారత్‌లో (Bharath) ఏకంగా 9.3 లక్షల మంది మరణించినట్లు, ఆసియా దేశాల్లో 56 లక్షల మరణాలు సంభవించినట్లు లాన్సెట్‌ నివేదికలో తేలింది. అదే సమయంలో భారత్‌లో కొత్తగా 12 లక్షల కొత్త కేసులు నమోదుకాగా ఆసియా దేశాల్లో 94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి

క్యాన్సర్‌ (Cancer) మహమ్మారితో 2019లో భారత్‌లో (Bharath) ఏకంగా 9.3 లక్షల మంది మరణించినట్లు, ఆసియా దేశాల్లో 56 లక్షల మరణాలు సంభవించినట్లు లాన్సెట్‌ నివేదికలో తేలింది. అదే సమయంలో భారత్‌లో కొత్తగా 12 లక్షల కొత్త కేసులు నమోదుకాగా ఆసియా దేశాల్లో 94 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో ఆసియాలో చైనా (China), భారత్‌, జపాన్‌ (Japan)లు మొదటి స్థానాల్లో ఉన్నాయి. చైనాలో 48 లక్షల కొత్త కేసులు, 27 లక్షల మరణాలు, జపాన్‌‌‌‌లో 9 లక్షల కేసులు, 4.4 లక్షల మరణాలు సంభవించాయని నివేదికలో వెల్లడించారు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్, ఇంజురీస్, రిస్క్ ఫ్యాక్టర్స్ 2019 స్టడీ (జీబీడీ 2019)లోని గణాంకాల ఆధారంగా 49 ఆసియా దేశాల్లో నమోదైన 29 రకాల క్యాన్సర్ ప్యాటర్న్స్‌‌‌‌ను పరీక్షించామని లాన్సెట్‌ వెల్లడించింది.

Updated On 3 Jan 2024 10:39 PM GMT
Ehatv

Ehatv

Next Story