Idly day Special Idly Story:ఇడ్లీ కథను మీరు ఎపుడైనా చూశారా ? ఇడ్లీ డే స్పెషల్ .!
భారతదేశంలోని(India) ప్రధాన ఆహారంలో ఒకటి ఇడ్లీ(idly) ఎలాంటి వాళ్ళ ఇళ్లలో అయిన వారానికి కనీసం 2 లేదా 3 రోజులు ఈ అల్పహారం Breakfastఉండాల్సిదే . అటు ఆరోగ్యం తో పాటు రుచి ని మెండుగా ఇస్తుంది. చట్నీ(Chutney) సాంబార్(sambar) కాంబినేషన్ తో తింటే ఆ రుచే వేరు .ఆయిల్ ఫుడ్ కన్నా ఈజీ గా ఉండటమే కాకుండా మంచి అరుగుదలతో నోరూరిస్తుంది . పైగా గంటల తరబడి వంట గదిలో నిల్చోవాల్సిన పని కూడా లేదు […]
భారతదేశంలోని(India) ప్రధాన ఆహారంలో ఒకటి ఇడ్లీ(idly) ఎలాంటి వాళ్ళ ఇళ్లలో అయిన వారానికి కనీసం 2 లేదా 3 రోజులు ఈ అల్పహారం Breakfastఉండాల్సిదే . అటు ఆరోగ్యం తో పాటు రుచి ని మెండుగా ఇస్తుంది. చట్నీ(Chutney) సాంబార్(sambar) కాంబినేషన్ తో తింటే ఆ రుచే వేరు .ఆయిల్ ఫుడ్ కన్నా ఈజీ గా ఉండటమే కాకుండా మంచి అరుగుదలతో నోరూరిస్తుంది . పైగా గంటల తరబడి వంట గదిలో నిల్చోవాల్సిన పని కూడా లేదు .
అసలు ఇడ్లీ వంటకం దేశీయ పవంట కాదు . ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు. అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో ఇండోనేషియాకు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులూ, అవిరిపెట్టే పద్ధతులతో పాటు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.అని తెలుస్తుంది ..ఆలా ఇండియా(India) కు వచ్చిన అల్పహారం ఇడ్లీ .
దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంకూడా వారి వారి పద్ధతుల్లో ప్రత్యేకమైన వంటకాలను ఆహార పద్ధతుల్ని కలిగి ఉంటారు . ఇడ్లీ, వంటి అద్భుతమైన వంటకం అన్ని రాష్ట్రాల్లో మనకు దాదాపుగా కనిపిస్తుంది . ఇడ్లీ లో కొన్ని పోషకలను(vitamins) కూడా కలిగి ఉంటుంది. ఇడ్లీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) కూడా ఉన్నాయి.
ప్రతి దక్షిణ భారతీయుల ఇళ్లలో ఇది అతి ముఖ్యమైన అల్పాహారం breakFastఈ రోజుల్లో ఇడ్లీ సరైన అల్పాహారం ఆహారంగా ఇడ్లీ చాలా మంచిది అలాగే అదే సమయంలో ఆరోగ్యకరమైనది. ఇది సాంప్రదాయకంగా బియ్యం అలాగే మినపప్పుతో తయారు చేస్తారు , ఇది పులియబెట్టడానికి కొంత సమయం తీసుకోవాలి మరియు ఖచ్చితమైన తేలికపాటి మౌత్ ఫీల్ కోసం ఆవిరితో ఉడికించబడుతుంది. తృణధాన్యాలు మరియు పప్పుల కలయిక ఫలితంగా ఇడ్లీల నుండి వచ్చే పూర్తి ప్రోటీన్ దానిని మరింత రుచికరంగా చేస్తుంది
బరువు తగ్గడం: ఇడ్లీ తక్కువ కేలరీలు కలిగిన వంటకం, అందుకే బరువు తగ్గడానికి(Weight Loss) మంచిది. ఇందులో ప్రొటీన్లు మరియు ఫైబర్Fiber అధికంగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది మరియు మధ్యాహ్న భోజన కోరికను తగ్గిస్తుంది.
సాధారణం ఇడ్లీ లను మినపప్పు తో తయారు చేస్తారు దేంట్లో ఇడ్లీ రవ్వ ,లేదా ఇడ్లీ బియ్యాన్ని వాడుతారు. కానీ ఆరోగ్య రీత్యా వివిధ రకాల వెరైటీ ఇడ్లీలను ఇప్పుడు తయారు చేస్తున్నారు . జొన్న రవ్వ ఇడ్లీJonna Idli,రాగులతో చేసిన ఇడ్లీ.ఇలా కొన్ని రకాల మిల్లెట్స్ తో( Millets)పాటు వెజిటల్స్ ని(Veggies )ఇడ్లీ కి ఉపయోగించటం కూడా ఇడ్లీ రుచి తో పాటు ఆరోగ్యాన్ని పెంచుతుంది .
ఇడ్లీ కి సంబంధించి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
కంచి దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం బియ్యం, మిరియాలు, కొత్తిమీర, అల్లం, ఇంగువ, జీలకర్ర, తగినంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
కేరళలోని keralపాలక్కాడ్ palakadజిల్లాలోని రామస్సెరి అనే గ్రామంVillage ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక కుటుంబం ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండటం జరుగుతుంది .
ఇలా ఇడ్లీ ఆస్వాదించే రుచులు అనేకం ఆహారం లో ఇడ్లీ అద్భుతం.అలాంటి ఇడ్లీ కి కూడా ఒక ప్రత్యేక మైన రోజు ఉండటం విశేషం . మీ అందరికి ఇడ్లీ దినోత్సవ శుభాకాంక్షలు .