Ice Water Therapy : ఐస్ వాటర్ డిప్ థెరపీ.. చర్మాన్ని మరింత మెరిసేలా చేస్తుంది..
ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడికి చాలా మందికి స్కిన్ బర్న్ కావడం.. దురద రావడం.. ఎర్రబడటం జరుగుతుంది. అలాగే ముఖంపై టాన్ పెరుకుపోవడం.. కమిలిపోవడం జరుగుతుంది. ముఖంపై టాన్ తగ్గించడానికి మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులు ఉపయోగించడం వలన మరిన్ని సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చర్మాన్ని మరింత మెరిసేలా చేయాలంటే ఐస్ వాటర్ డిప్ థెరపీ చేయాలని అంటున్నారు చర్మ నిపుణులు.
ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండవేడికి చాలా మందికి స్కిన్ బర్న్ కావడం.. దురద రావడం.. ఎర్రబడటం జరుగుతుంది. అలాగే ముఖంపై టాన్ పెరుకుపోవడం.. కమిలిపోవడం జరుగుతుంది. ముఖంపై టాన్ తగ్గించడానికి మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులు ఉపయోగించడం వలన మరిన్ని సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చర్మాన్ని మరింత మెరిసేలా చేయాలంటే ఐస్ వాటర్ డిప్ థెరపీ చేయాలని అంటున్నారు చర్మ నిపుణులు. సినీతారలు సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ కాంతివంతమైన చర్మంతో అందంగా కనిపిస్తుంటారు. రోజంతా హెవీ మేకప్ వేసుకుని షూట్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? , ఇప్పటికీ ముఖంలో సహజమైన మెరుపు ఎలా ఉంటుందనే సందేహాలు కలుగుతుంటాయి. ఇక తారలు సైతం ఈ ఐస్ వాటర్ ఫేస్ డిప్ థెరపీ చేస్తుంటారు. అవును అసలు ఈ థెరపీ అంటే ఏమిటి ? ఇది చర్మానికి ఎంతవరకు మేలు చేస్తుంది?.. ఈ థెరపీని ఎలా తీసుకుంటారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తెలుసుకుందాం..
ఐస్ వాటర్ ఫేస్ డిప్ అంటే ఏమిటి?
చల్లటి నీటిని లేదా ఐస్ గడ్డలను ముఖంపై రుద్దడాన్ని థర్మోజెనిసిస్ అంటారు. ఈ థెరపీ చేయడానికి మీరు మీ ముఖాన్ని మంచు లేదా చల్లటి నీటితో నింపిన గిన్నెలో కొంత సమయం పాటు ముంచి ఆ తర్వాత బయటకు తీయాలి. దీనివల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకు ముందుగా మీరు మంచు నీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి 15 నుంచి 20 ఐస్ క్యూబ్స్ వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మీ ముఖాన్ని అందులో ముంచాలి. దీనిని అలా 5 నుండి 6 సార్లు రిపీట్ చేయాలి. దీనిని రోజూ ఉదయం చేయడం మంచిది. ఈ ప్రక్రియ మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
ఐస్ వాటర్ డిప్ థెరపీ బెనిఫిట్స్...
1. ఈ థెరపీ ముఖం వాపును తగ్గిస్తుంంది. ఉదయం లేవగానే ముఖం ఉబ్బి, కళ్లకింద ఉబ్బినట్లు ఉండేవారు ఈ ఐస్ వాటర్ ఫేస్ డిప్ థెరపీ చేయడం వల్ల చర్మానికి ఉపశమనం లభిస్తుంది.
2. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. మీ ముఖాన్ని చల్లటి నీటిలో ముంచినప్పుడు, అది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.
3. ఈ థెరపీ చర్మంపై ముడతలు, ఫైన్ లైన్ల సమస్యను కూడా తగ్గిస్తుంది.
4. ఓపెన్ పోర్స్ అనేది అతి పెద్ద చర్మ సమస్యలలో ఒకటి. మీ ముఖం రంధ్రాలు పెద్దవిగా ఉన్నప్పుడు అందులో నూనె, ధూళి, దుమ్ము దానిలో పేరుకుపోతాయి. దీంతో అవి మీ చర్మ సహజ కాంతిని తొలగిస్తాయి. ఇందులో సెబమ్ పేరుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. ఈ థెరపీ చేయడం వలన రంధ్ర పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ముఖం ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తుంది.
5. చర్మం చాలా సున్నితంగా ఉన్నవారు ఈ థెరపీ చేసే ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.