మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. రోజంతా ఎంతో కష్టపడుతున్నారు. రోజంతా ఆఫీస్ , ఇంటి పనులు చేసి అలసిపోయి.. హ్యాపీగా నిద్రపోవాలని(Sleep) ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ చాలాసార్లు వెన్నునొప్పి, ఒత్తిడి, అలసట తదితర కారణాల వల్ల రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టదు. అలాంటిప్పుడు వారు ఏం చేయాలి.

అయితే చాలా సింపుల్ గా ఓ చిట్కాపాటించడం వల్ల హాయిగా నిద్రపోతారు మహిళలు. ఇలాంటి పరిస్థితిలో, మీ కాళ్ళ మధ్య ఒక దిండు(Pillow) పెట్టుకుని నిద్రపోండి.. దాని వల్ల చాలా ప్రయోజనాలను మీరు పొందుతారు. రాత్రిపూట కాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెన్నెముక అమరికను కూడా మెరుగుపరుస్తుంది.

సాధారణంగా, మహిళలు ఋతుస్రావం(Periods) సమయంలో నొప్పి మరియు చికాకును అనుభవిస్తారు. కాబట్టి దీన్ని వదిలించుకోవాలంటే కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోండి. ఇది మీకు ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. అంతే కాదు రాత్రిపూట కాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరీ ముఖ్యంగా ఈ చిట్కా గర్భిణిలకు బాగా ఉపయోగపడుతుంది. గర్భిణులు రాత్రి సుఖంగా నిద్రపోవాలంటే గర్భిణీలు ఒకవైపు పడుకుని కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవాలి. ఇది మీకు సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా పొట్ట నరాలపై ఒత్తిడిని నివారిస్తుంది.

లేడీస్, మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు పెల్విక్ నొప్పితో బాధపడుతుంటే, నొప్పిని తగ్గించడానికి మరియు సౌకర్యాన్ని అందించడానికి మీ కాళ్ళ మధ్య దిండుతో నిద్రించండి. రోజంతా పనిచేసి, అలసట వల్ల చేతులు, కాళ్లు నొప్పులు వస్తే కాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రిస్తే అలసట తొలగి ప్రశాంతంగా నిద్రపోతుంది.

Updated On 11 April 2024 5:11 AM GMT
Ehatv

Ehatv

Next Story