Aloe Vera For Hair Growth : తడి లేదా పొడి జుట్టుకు కలబందను అప్లై చేస్తే ఎన్నో ప్రయోజనాలు..
కలబంద(Aloe Vera)ను చాలా కాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సంరక్షణ నుంచి జుట్టు సంరక్షణ వరకు అన్నింటికి ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతుంటే కలబంద అనేక సమస్యలను నయం చేస్తుంది. మీ తలలో చుండ్రు ఉండి జుట్టు మూలాల్లో ఎప్పుడూ దురద ఉంటే అలోవెరా జెల్‌ను ఉపయోగించాలి. ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది అన్ని రకాల వాపులను కూడా తగ్గిస్తుంది.
కలబంద(Aloe Vera)ను చాలా కాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సంరక్షణ నుంచి జుట్టు సంరక్షణ వరకు అన్నింటికి ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతుంటే కలబంద అనేక సమస్యలను నయం చేస్తుంది. మీ తలలో చుండ్రు ఉండి జుట్టు మూలాల్లో ఎప్పుడూ దురద ఉంటే అలోవెరా జెల్‌ను ఉపయోగించాలి. ఇందులో ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది అన్ని రకాల వాపులను కూడా తగ్గిస్తుంది. అంతే కాదు అదనపు సెబమ్ ఉత్పత్తిని తగ్గించి, జుట్టును మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యవంతంగా మార్చుతుంది. ఇందులో విటమిన్ సి, ఇ, ఎ పుష్కలంగా లభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది. కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.
మెడికల్ హెల్త్ టుడే ప్రకారం మీరు డ్రై హెయిర్‌కు తాజా కలబంద జెల్‌ను అప్లై చేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం తాజా కలబంద ఆకులను కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు దానిని ఒక ప్లేట్‌లో ఉంచండి. మెల్లగా దాని పైభాగాన్ని తీసివేసి వేరు చేయాలి. ఇప్పుడు గిన్నెలో ఒక చెంచా సహాయంతో జెల్ ఉంచండి. ఈ జెల్‌ను నేరుగా మీ జుట్టు మూలాలకు అప్లై చేస్తూ ఉండండి. ఇది అన్ని జుట్టు, మూలాలకు పట్టించిన తర్వాత జుట్టును అరగంట పాటు వదిలివేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. కావాలంటే కొబ్బరినూనె, జోజోబా ఆయిల్ మొదలైన వాటితో కూడా జుట్టుకు రాసుకోవచ్చు. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే లాభాలు త్వరగానే కనిపిస్తాయి.