ఇప్పుడు చాలా రకాల షాంపోలు... ఫుల్ కెమికల్స్ తో ఉండటం వల్ల.. తలకు పేలు పట్టడం లేదు కాని.. కొంత మంది తలపై పుట్టలు పుట్టులుగా పేలు ఉంటాయి. మరి వాటిని తరమికొట్టేందుకు మన పెద్దవాళ్లు వాడిని కొన్ని ఇంటిపద్దతులేంటో తెలసుకుందాం. మీలో ఎవరికైనా పేల బాధ ఉంటే.. ఇలా ప్రయత్నించి చూడండి.. దెబ్బకు పేలు మాయం అవుతాయి. జుట్టుకు.. మాడుకు... బాగా బాదంనూనె పెట్టుకుని..

11ఇప్పుడు చాలా రకాల షాంపోలు... ఫుల్ కెమికల్స్ తో ఉండటం వల్ల.. తలకు పేలు పట్టడం లేదు కాని.. కొంత మంది తలపై పుట్టలు పుట్టులుగా పేలు ఉంటాయి. మరి వాటిని తరమికొట్టేందుకు మన పెద్దవాళ్లు వాడిని కొన్ని ఇంటిపద్దతులేంటో తెలసుకుందాం. మీలో ఎవరికైనా పేల బాధ ఉంటే.. ఇలా ప్రయత్నించి చూడండి.. దెబ్బకు పేలు మాయం అవుతాయి.

జుట్టుకు, మాడుకు... బాగా బాదంనూనె(Almond oil) పెట్టుకుని.. తలను బాగా మసాజ్(Head Massage) చేసుకోవాలి. దానివల్ల పేలు పారిపోతాయి. ఆతరువాత తలస్నానం చేస్తే.. పేలు జారిపోయి రాలిపడతాయి.

పేలను వదిలించడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లు రసం లా చేసుకుని.. తలకు పూసుకొంటే చాలు.. ఆఘాటుకు తలలో పేలు హరించుకుపోతాయి.

అంతే కాదు ఉల్లి రసం కూడా పేలు పోవడానికి బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం, కొబ్బరినూనెతో కలిపి తలకు పెట్టుకుంటే.. కాస్త ఘాటు తగులుతుంది కాని.. ఆ ఘాటుకు తలలో పేలు హరించును

ఇక పటికను 5 గ్రాములు తీసుకోవాలి. పటిక కిరాణ షాపులో కాని.. ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. ఆ పటికను తీసుకుని లీటరు నీటిలో కరిగించి ప్రతీ రోజు తలకు మర్దనా చేసుకోండి తలలో పేలు పారిపోతాయి.

అంతే కాదు తిప్పతీగ ఆకు రసము, మందార రసము, నిమ్మ చెక్క.. ఉసిరి పొడి, గొరింట ఆకు.. ఇవన్నీ తలలో పేలు హరిచేలా చేస్తాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి ప్రయత్నించి చూడండి.

Updated On 15 April 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story