Gas Cylinder : సిలిండర్‌లో గ్యాస్ ఎంత వరకు ఉందో ఎలా తెలుసుకోవడం?
గ్యాస్ సిలిండర్‌లో(Gas Cylinder) గ్యాస్ ఎంత వరకు ఉంది? ఎప్పుడయిపోతుంది? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు నిత్యావసరాలో ఒకటయ్యింది. గ్యాస్ రెట్లు డబుల్ ట్రిపుల్ అయినా కొనక తప్పని పరిస్థితి.
గ్యాస్ సిలిండర్‌లో(Gas Cylinder) గ్యాస్ ఎంత వరకు ఉంది? ఎప్పుడయిపోతుంది? అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు నిత్యావసరాలో ఒకటయ్యింది. గ్యాస్ రెట్లు డబుల్ ట్రిపుల్ అయినా కొనక తప్పని పరిస్థితి. ఈ నగరంలో, అది కూడా ఫ్లాట్‌లలో మళ్లీ కట్టెల పొయ్యి మీద అయితే వంట చేసుకోలేకం కదా! మనం చేసే వంట పూర్తిగా గ్యాస్‌పైనే ఆధారపడి ఉందన్నమాట! అందుకే ఎప్పుడయిపోతుందోనన్న భయం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడైతే రెండు సిలిండర్లు ఉన్నాయనుకోండి. అయితే సిలిండర్‌లో గ్యాస్ ఎంతవరకు ఉందన్నది తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరికీ ఉంటుంది. సిలిండర్‌ను పైకెత్తి బరువు చూసి చెబుతుంటారు కొందరు. కొందరేమో అటు ఇటు కదల్చి గ్యాస్ క్వాంటిటీని చెబుతారు. కానీ అలాంటి అవసరాలు లేకుండా చిన్న చిట్కాతో సిలిండర్‌లో గ్యాస్ ఎక్కడ వరకు ఉందో తెలుసుకోవచ్చు. తడి గుడ్డతో(Wet cloth) గ్యాస్ సిలిండర్‌ను పై నుంచి కిందవరకు తుడవాలి. ఇది చేస్తున్నప్పుడు ఫ్యాన్ తిరగకూడదు సుమా! సరే, తడి బట్టతో తుడిచిన ఒక నాలుగైదు నిమిషాల తర్వాత గమనించండి. గ్యాస్ లేని భాగంలో నీటి తడి తొందరగా ఆరిపోతుంది .సిలిండర్ లో గ్యాస్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం తడి చాలా నిదానంగా ఆరుతుంది. అంటే సిలిండర్ మీద తడి ఎంత ప్లేస్ వరకు ఉందో అక్కడి వరకు గ్యాస్ ఉందని అర్థం. సింపుల్ మెథడ్ కదూ! ఇక నుంచి దీన్ని ఫాలో అవ్వండి.