ప్రస్తుతం ఎక్కవగా మనిషిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అధికబరువు(Overweight) కూడా ఒకటి. మరి ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలి. దాని కోసం ఆయుర్వేదం(Ayurveda)లో ఉన్న చిట్కాలేంటి.. మనిషి జీవన విధానంలో ఎటువంటిమార్పులు కావాలి చూద్దాం.. అధిక బరువు సమస్య మనం కొనితెచ్చుకునేదే. సరైన వ్యాయామం లేకుండా.. మంచి తిండి అలవాట్లు లేకపోవడం, ఆరోగ్యంపై శ్రద్దలేకపోవడంతో ఇటువంటి సమస్య తలెత్తుతుంది.

ప్రస్తుతం ఎక్కవగా మనిషిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో అధికబరువు(Overweight) కూడా ఒకటి. మరి ఆ సమస్య నుంచి ఎలా బయట పడాలి. దాని కోసం ఆయుర్వేదం(Ayurveda)లో ఉన్న చిట్కాలేంటి.. మనిషి జీవన విధానంలో ఎటువంటిమార్పులు కావాలి చూద్దాం..

అధిక బరువు సమస్య మనం కొనితెచ్చుకునేదే. సరైన వ్యాయామం లేకుండా.. మంచి తిండి అలవాట్లు లేకపోవడం, ఆరోగ్యంపై శ్రద్దలేకపోవడంతో ఇటువంటి సమస్య తలెత్తుతుంది. మరి దాని నివారణకు మనం ఏం చేయాలి చూద్దాం.

ముఖ్యంగా ఆహార నీయమాలు అధిక బరువు నుంచి రక్షిస్తాయి. అందులో ముఖ్యంగా తినే తిండి ఎప్పుడు ఒకే రకం ఉండకూడదు. అన్ని రకలాల ఆహారాలను తీసుకుంటుండాలి. ఒకే రకం ఆహారానికి పరిమితం కాకూడదు. దీనినే ఆయుర్వేదంలో షడ్రసోపేతమైన ఆహారం అంటారు.

ఆహారంలో పిండి పదార్థాలను 60 శాతం,మాంసకృత్తులు 20 శాతం, కొవ్వు పదార్థాలు 20 శాతం ఉండేలా చూసుకోవాలి. నాన్ వెజ్ తినేవారు గొర్రె పోర్క్ బీఫ్ బదులుగా స్కిన్ లెస్ చికెన్ తో పాటు నాటు కోడి(Natu Kodi), చేపల(Fish) మాంసం తినాలి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రై ఫ్రూట్స్(Dryfruits) బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి. షుగర్ లేకుండా పండ్లరసాలు తాగడం ఉత్తమం.

ఇక తినే విధానం బట్టి కూడా బాగా బరువు పెరుగుతారు. ఆత్రంగా, గబగబా తింటే ఎంత తిన్నారో, ఏమి తిన్నారో తెలియక ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కనుక నెమ్మదిగా ప్రతి ముద్దనూ నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో లాలాజలం విడుదలై ఆహారం బాగా జీర్ణమవుతుంది. తినేటప్పుడు వేరే పనిమీద దృష్టిపెట్టకూడదు. మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ, చదువుతు తినకూడదు. ముఖ్యంగా మనం భోజన సమయంలో చిరుతిండ్లు తినకూడదు.

ఇక పండ్ల విషయానికి వస్తే.. ద్రాక్షపండ్లు(Grapes), జామపండ్లు(Guava) వంటివి తినవచ్చు. ఇవి మలబద్దకం(Constipation) నివారించి... ఫ్రీ మోషన్ కు సహకరిస్తాయి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం ఎక్కువగానూ, రాత్రి పూట తీసుకునే ఆహారం అల్పమోతాదులోనూ ఉండాలి.తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే అధిక బరువును తగ్గించడంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఏడాదికాలంపాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలి.

అంతే కాదు అధిక బరువును తగ్గించే క్రమంలో గోధుమలు(Wheat), బార్లి(Barley), ఓట్స్(Oats) లలో అధిక మొత్తాల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. పీచువల్ల మలమూత్రాల నిర్వాహణ సజావుగా జరుగుతుంది. ఏడాది పాటు పాతబడిన బియ్యాన్ని వాడుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. అయితే కొత్త బియ్యం వాడితే కఫం పెరిగి లావెక్కుతారు.

ఇక ముఖ్యమైన వాటిలో.. ఆహారం తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే ఆహారానికి ముందు నీళ్ళు త్రాగాలి. ఆహారానికి ముందు 2 గ్లాసుల నీళ్ళు తాగితే సన్నబడతారని ఆయుర్వేద లావెక్కుతారు కనుక కనీసం అరగంట వరకూ ఆగాలి. ఇలా జాగ్రత్తగా ఉంటే.. స్థూలకాయం నుంచి బయటపడవచ్చు.

Updated On 15 April 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story