How to Keep Cut Apples Fresh: కట్ చేసిన ఆపిల్ కలర్ మారుతుందా..? అయితే ఇలా చేయండి. పండ్లు తాజాగా ఉంటాయి.
How to Keep Cut Apples Fresh: కట్ చేసిన ఆపిల్ కలర్ మారుతుందా..? అయితే ఇలా చేయండి. పండ్లు తాజాగా ఉంటాయి.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. మరీముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో పండ్లు ప్రముఖ పాత్రపోషిస్తాయి. వాటిలో అవసరమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈపండ్లు తినేప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు పండ్లు కోసిన తరువాత కొంత బాగం తిని..మరికొంత బాగం స్టోర్ చేయాలి అంటే అవి రంగు మారుతుంటాయి. మరీ ముఖ్యంగా ఆపిల్ లాంటి ప్రూట్స్ నల్లగా మారుతుంటాయి. మరి అలా తరిగిన పండ్లు రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు తరిగిన పండ్లు ఎందుకు రంగు మారుతాయి. దానికి కారణం ఏంటి..? కోసిన పండ్లు రంగు మారడానికి ప్రధాన కారణం వాటిలోని ఎంజైమ్‌లు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య తీసుకోవడం ప్రారంభించడమే. దీనివల్ల పండ్లు కోసిన తర్వాత త్వరగా రంగు మారుతాయి. ముఖ్యంగా ఆపిల్స్. మరి అలా రంగు మారకుండా చేయడానకి కొన్ని పదార్ధాలు అవి కూడా వంటగదిలో ఉన్న పదార్ధాలు ఉపయోగపడతాయి. అవేంటంటే..?
ఉప్పు నీరు
ఒక పాత్రలో నీరు పోసి, దానికి కొద్దిగా ఉప్పు వేసి, పండ్లను కొన్ని నిమిషాలు నానబెట్టండి. ఇది పండు యొక్క రంగు మారడాన్ని తగ్గిస్తుంది. ఆపిల్స్ ను ఇలా చేస్తే... అవి నల్లగా మారకుండా ఉంటాయి. కూరలకు వాడే వంకాయ కూడా ఇలానే ఉప్పువేసిన నీటిలో ఉంచితే రంగు మారదు.
వెనిగర్:
వెనిగర్ ను నీళ్లలో కలిపి అందులో పండ్లను కొన్ని నిమిషాల పాటు ఉంచితే.. కోసిన తర్వాత కూడా పండ్లు తాజాగా ఉంటాయి. ఎందుకంటే వెనిగర్‌లో ఉండే యాసిడ్ పండు కోసిన తర్వాత రంగు మారకుండా చేస్తుంది.
తేనె:
పండ్ల రంగు మారకుండా ఉండటానికి తేనెను పూయవచ్చు లేదా వాటిపై పోయవచ్చు. ఇలా చేయడం వల్ల పండ్లలోకి గాలి చేరకుండా ఉంటుంది దాంతో పండు రంగు మారకుండా ఫ్రెష్ గా ఉంటుంది.
నిమ్మరసం:
పండు చెక్కుచెదరకుండా ఉండటానికి తరిగిన ముక్కలపై నిమ్మరసం పిండండి. లేదంటే.. నిమ్మరసం వేసిన నీళ్ళలో ముక్కలు వేయండి.. అవి తాజాగా ఉంటాయి. అయితే తినేప్పుడు మాత్రం వాటిని కడిగేయడం మంచింది.