వర్షాకాలంలో పాదాల దురద తగ్గించుకోవడానికి..
వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్లు(Foot Infection) సర్వసాధారణం. పాదాలు ఎల్లప్పుడు తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా(Bacteria), క్రిమికీటకాలు(Germs), వైరస్(Virus) లు పాదాలపై అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అవి కాస్త దురదకు(Iching) దారితీస్తాయి. ఇలాంటి దురద సమస్యతో బాధపడే వారు బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా కాళ్లూ చేతులూ కడుక్కోవాలి.

వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరస్ లు తొందరగా వ్యాపిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. ఈ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు తొందరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. వర్షాకాలంలో వీలైనంతవరకు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా పాదాలను(Feet) ఆరోగ్యంగా చూసుకోవాలి. గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురవడం వల్ల ఇంటి పరిసరాలు.. రోడ్లు నిరంతరం తడిగా(Wet) ఉంటున్నాయి. నీటిలో, బురదలో, మురికిలో నుంచి నడవాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు ఉపయోగించడం వలన పాదాలను రక్షించుకోవచ్చు.

వర్షాకాలంలో పాదాల దురద తగ్గించుకోవడానికి..
వర్షాకాలంలో పాదాలకు ఇన్ఫెక్షన్లు(Foot Infection) సర్వసాధారణం. పాదాలు ఎల్లప్పుడు తడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా(Bacteria), క్రిమికీటకాలు(Germs), వైరస్(Virus) లు పాదాలపై అలాగే ఉండిపోయి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. అవి కాస్త దురదకు(Iching) దారితీస్తాయి. ఇలాంటి దురద సమస్యతో బాధపడే వారు బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా కాళ్లూ చేతులూ కడుక్కోవాలి. పాదాలను టవల్ తో తుడుచుకుని పొడిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, వెనిగర్ లను కలిపిన మిశ్రమాన్ని రాసుకోవాలి. దురద ఉన్న చోట ఇలా రాసి కాసేపాగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే దురద తగ్గుతుంది.

పాదాలపై డెట్ స్కిన్(Dead skin) తొలగిపోవాలంటే:

పాదాలపై సహజంగానే చర్మ మృత కణాలు ఉండిపోతాయి. కొద్దిగా తడిగా ఉన్నా పాదాలకే ఉండిపోతాయి. అలాంటి డెడ్ స్కిన్ వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం పాదాలను రోజూ స్క్రబర్ తో రుద్దుకోవాలి. ముందుగా కొద్దిగా తడి చేసి కాసేపాగి తర్వాత స్క్రబర్ తో రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి.ఆ తర్వాత పాదాలు మృదువుగా కూడా మారతాయి. అలాగే రోజూ రాత్రి పాదాలకు కొబ్బరినూనెను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

పాదాలు శుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్లు వస్తాయి. సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా తొలగించుకోవడానికి గోరు వెచ్చని నీటితో కాళ్లను కడగాలి. బకెట్ లో గోరు వెచ్చని నీటిలో సాల్ట్ వేసి బాగా కలిపి అందులో పాదాలను ఉంచాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా, పొడిగా ఉండేలా తుడుచుకోవాలి. కాలివేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి.

Updated On 21 July 2023 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story