చిన్న పెద్దా లేకుండా.. ప్రతీ ఒక్కరినిబాధిస్తున్నసమస్యలలో చంద్రు సమస్యకూడా ఒకటి. ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది మారుతున్న జీవనశైలి.. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, వీటివల్ల చాలాప్రమాదం ఉంది జుట్టుకు, మరి సహజ పద్దతుల తో.. మనం చుండ్రు సమస్య నుంచి ఎలా బయటపడాలి చూద్దాం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి జుట్టుకు కొబ్బరినూను కూడా ఉపయోగించవచ్చు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ వంటి పోషకాలు కొబ్బరి నూనెలో ఉంటాయి. ఇది మిమ్మల్ని చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది.

పుదీనా రసాన్ని బాగా తలకు పట్టించి అరగంటసేపు వదిలేసి ఆ తర్వాత తలను శుభ్రం చేస్తే చుండ్రు సమస్య ఉండదు. అంతేకాదు వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి ఓ పావుగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి తల శుభ్రంగా ఉంటుంది. మెంతికూరను కూడా దంచి పేస్టులాగా చేసి తలకు రాస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గి వెంట్రుకలు నిగనిగలాడతాయి.

పెరుగు, నిమ్మకాయను జుట్టుకి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. పెరుగులో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. దీని కోసం పెరుగు, నిమ్మరసం బాగా కలిపి తలకు పట్టించి కాసేపు అలాగే ఉండాలి. ఆ తర్వాత జుట్టు కడగాలి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది. పెరుగు, నిమ్మరసం జుట్టు రాలే సమస్యను తొలగిస్తుంది. ఇందుకోసం పెరుగు, నిమ్మకాయతో పాటు కొద్దిగా కరివేపాకు జోడిస్తే జుట్టు రాలడం తగ్గిస్తుంది.

కలబంద కూడా చుండ్రు సమస్యను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గటంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చుండ్రు సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Updated On 28 Aug 2023 8:08 AM GMT
Ehatv

Ehatv

Next Story