ఏసీజన్ అయినా సరే.. ఆరోగ్యంగా ఉండి.. ఫిట్‌గా ఉంటేనే ఆ సీజన్‌ని ఆస్వాదించగలుగుతాం. ముఖ్యంగా వర్షాకాలంవచ్చిందంటే మన ఆరోగ్యం చెడగొట్టడానికి రకరకాల వ్యాధులు(Diseases) రెడీగా ఉంటాయి. అందకే కొన్ని చిట్కాలు(Tips) పాటిస్తే ఆరోగ్యంతో(Health) ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
ఏసీజన్ అయినా సరే.. ఆరోగ్యంగా ఉండి.. ఫిట్‌గా ఉంటేనే ఆ సీజన్‌ని ఆస్వాదించగలుగుతాం. ముఖ్యంగా వర్షాకాలంవచ్చిందంటే మన ఆరోగ్యం చెడగొట్టడానికి రకరకాల వ్యాధులు(Diseases) రెడీగా ఉంటాయి. అందకే కొన్ని చిట్కాలు(Tips) పాటిస్తే ఆరోగ్యంతో(Health) ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో(Monsoon Season) వకడుపునొప్పి వంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి వాటికి కారణం వర్షాల ప్రభావంతో నీటి వనరులు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటమే. అందుకే వర్షకాలం కష్టం అనుకోకుండా.. సురక్షితమైన కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
వర్షాకాలం కాపాడుకోవలసినది ముఖ్యంగా మానవ జీర్ణ ప్రక్రియ. ఇది ఎప్పుడూ చాలా లైగ్ గా.. ఈజీగా అరిగే పదార్ధాలను తినడం లాంటి వాటితో ఆరోగ్యంగా ఉంటుది. ఎల్లప్పుడూ ఈజీగా అరిగే పదార్ధాలు తినేలా చూసుకోవడం మంచిది. పెరుగు మొదలైన ప్రోబయోటిక్స్ తీసుకోండి. ఇవి శరీరం లోపల కావలసిన మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. వర్షాకాలంలో నిల్వచేసిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి ఎందుకంటే అవి ప్రారంభంలోనే ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములను ఆకర్షించవచ్చు.
వర్షాకాలం మనం తిపే ప్రతీ పాదార్ధంలో.. ప్రోటీన్లు, ఫైబర్ మరియు ఇతర పోషకాలను పుష్కలంగా ఉండేలా చూసుకోండి. మరీ ముఖ్యంగా తాజా కూరగాయలను చేర్చండి. కూరగాయలను బాగా కడగాలి . ఇక వీలైనంత వరకు పచ్చి ఆహారాన్ని తినకుండా ఉండండి. ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి
వర్షాకాలంలో అస్సలు చేయకూడని పని స్ట్రీట్ ఫుడ్ తినడం. మరీ ముఖ్యంగా పానీపూరి లాంటివి తినకూడదు. మసాలా, జంక్ ఫుడ్ లాంటివి తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు అజీర్ణానికి దారితీస్తుంది. స్ట్రీట్ ఫుడ్ బండ్ల వద్ద ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్దాలు కలిషితం అయితే.. అది తినేవారికి అనారోగ్యం కలిగించవచ్చు.
ఈ అపరిశుభ్రమైన పరిస్థితులు టైఫాయిడ్ నుండి కలరా వరకు అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు కారణం కావచ్చు అని చెబుతున్నారు. ఏ ఆహారం తీసుకున్నా అతిగా తినకుండా మితంగా తినాలని సూచిస్తున్నారు
ఇక వర్షంలో తడవడం కూడా చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. చాలామంది వర్షం పడుతుంది అంటే చాలు వర్షంలో తడవటానికి ఇష్టపడతారు. కాని అలా వర్షాలలో ఎక్కువ సమయం తడవడం మంచిదికాదని సూచిస్తున్నారు. వర్షపు నీళ్లతో పాటు వచ్చే కాలుష్య కారకాలు మన చర్మానికి, జుట్టుకి హాని చేకూరుస్తాయని, అనారోగ్యాన్ని కలిగిస్తాయి అని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ అలా వర్షంలో తడిసినప్పటికీ, వెంటనే వేడి నీళ్లతో స్నానం చేయాలని సూచిస్తున్నారు.
వర్షాకాలంలో నారింజ వంటి విటమిన్ సి(Vitamin C) అధికంగా ఉండే పండ్లతో పాటు, బత్తాయి వంటి పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు. నిజంగా కాలేయంలో ఉన్న టాక్సిన్స్‌ను శుభ్రం చేయడంలో మరియు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో యాపిల్ చాలా సహాయపడుతుంది. పండ్లలో విటమిన్లు మరియు ఖనిజాల సహజ వనరులు ఒక వ్యక్తి ఆరోగ్యం, బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైనవని చెప్తున్నారు.
రోడ్లపై అధిక వర్షపు నీరు నిండి వున్న ప్రదేశాలలో ఉద్దేశపూర్వకంగా నడవకండి. ఇవి మలేరియా మరియు డెంగ్యూ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులకు వాహకాలుగా ఉన్న దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలు. ముఖ్యంగా సాయంత్రం పూట బయటకు వెళ్లేటప్పుడు పురుగుల నిరోధకాలు, దోమల బారినుండి కాపాడుకునేలా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి.