సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది ..... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఆసక్తి చూపుతారు . , చాలామంది సందర్బం ఏదైనా... పార్టీ ఏదైనా, బిర్యానీతో పాటు కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందేనంటారు . నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే టీ ,కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు . కానీ ఇపుడు కూల్ డ్రింక్స్ ఒక భాగమైపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్ డ్రింక్స్ తాగడం […]

సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యింది ..... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఆసక్తి చూపుతారు . , చాలామంది సందర్బం ఏదైనా... పార్టీ ఏదైనా, బిర్యానీతో పాటు కూల్‌డ్రింక్స్ ఉండాల్సిందేనంటారు . నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే టీ ,కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు . కానీ ఇపుడు కూల్ డ్రింక్స్ ఒక భాగమైపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్ డ్రింక్స్ తాగడం ఫ్యాషనైపోయింది.

కొంతమంది మంచి నీళ్ల కంటే కూల్ డ్రింక్సే ఎక్కువగా తాగుతుంటారు. రోజూ లీటర్‌కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు. అయితే ఈ అలవాటు.. ఆరోగ్యానికి చేటనే వైద్య నిపుణులు చెపుతున్నారు .ఈ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కూల్‌డ్రింక్స్‌ను అధికంగా సేవించడం వల్ల వాటిలో ఉండే చక్కెర శరీరానికి అదనపు క్యాలరీలను ఇస్తుంది. దీంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవి కూల్‌డ్రింక్స్‌లో ఉండే పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపేయడానికి నీటిని ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడి, నీరసం చెందుతారు.

కూల్‌డ్రింక్స్‌లో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం నిత్యం తీసుకునే మోతాదుకు మించరాదు. మోతాదు మించితే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది. బీపీ పెరుగుతుంది. కాల్షియం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు తలెత్తి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్స్‌ను మితి మీరి తాగడం మంచిది కాదు .

శీతల పానీయాల్లో తీపి వంటి రుచి కోసం అధిక చక్కెరను వినియోగిస్తారు. అది శరీర అవయవాలను డ్యామేజ్ చేస్తుంది. ఫ్రాన్స్‌లోని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ నిర్వహించిన స్టడీకి నేతృత్వం వహించిన పరిశోధకుడు నీల్ మర్ఫీ తెలిపిన వివరాల ప్రకారం.. శీతల పానీయులు మరణంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు. సోడా ఆధారిత పానీయాల్లో అధిక మొత్తంలో కృత్రిమ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు.
ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు.. ‘జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌’లో ప్రచురించారు. గత కొన్నేళ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 452,000 మంది పురుషులు, మహిళలపై ఈ పరిశోధనలు సాగించారు. రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల శీతల పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలుసుకున్నారు.

కూల్ డ్రింక్స్ అంతర్గత అవయవాలకే కాదు... దంతాలకు కూడా ప్రమాదకరమే. శీతల పానీయాల్లోని సోడాలో ఫాస్పోరిక్, కార్బోనిక్ ఆమ్లాలు ఉంటాయి. అవి నోటిలో ఆమ్ల స్థాయిని పెంచుతాయి. ఫలితంగా దంత క్షయం ఏర్పడుతుంది. అంతేగాక, శీతల పానీయాల్లో ఉండే అధిక చక్కెర సైతం దంతాలను నానశం చేస్తాయి. నోటిలో చెడు బ్యాక్టీరియా వృద్ధికి దారితీస్తుంది. కూల్ డ్రింక్స్‌లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలకు చేటు చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొర కరిగిపోతుంది. దంత క్షయం ఏర్పడుతుంది. దీంతో దంతాలు సెన్సిటివ్‌గా మారి చల్లని, వేడి పదార్థాలు తింటే తట్టుకోలేకపోతారు.

మరోవైపు శీతల పానీయాలు అతిగా తాగడం వల్ల ప్రధానం ఏర్పడే సమస్య ‘డయాబెటీస్ . శీతల పానీయాల్లో ఉండే అధిక కేలరీలు మధుమేహానికి దారి తీస్తాయి. శరీరంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అవి క్రమేనా టైప్-2 డయాబెటీస్‌గా మారి జీవితాన్ని దుర్భరంగా మార్చేస్తాయి.

శీతల పానీయాల వల్ల కలిగే మరింత భయానకమైన ముప్పు.. ‘క్యాన్సర్’. సోడా ఆధారిత శీతల పానీయాలు ఎప్పటికీ మంచిది కాదని పరిశోధకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఎరేటెడ్ డ్రింక్స్, షుగర్ కంటెంట్ గల శీతల పానీయాలు వల్ల క్యాన్సర్‌కు దారితీయొచ్చని తెలిపారు. సోడా ఆధారిత పానీయం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ ఏర్పడుతుందని తెలిపారు. అలాగే చక్కెర ఆధారిత పానీయాల వల్ల మహిళల్లో రుతుక్రమం ఆగిపోయి.. ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ ఏర్పడవచ్చని వెల్లడించారు.
ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం .. అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.

Updated On 23 Feb 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story